విలేఖరుల ముసుగులో ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ సంఘటన పై కలెక్టరు కు ఫిర్యాదు - విచారణకు ఆదేశించిన కలెక్టర్
ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ జి.ఓ.యం.యస్. నెం. 58 పేరుతో జర్నలిస్టుల ముసుగులో కొందరువ్యక్తులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో క్రమబద్దీకరణ చేసిన విషయమై విచారణ జరిపి రద్దు చేయులని ఆ ధరకాస్తు లో కోరిన నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ. వెంటనే విచారణ జరపాలని జెసి నీ ఆదేశించిన కలెక్టర్.
ఫిర్యాదు వెంట అక్రమముగా క్రమబద్ధీకరణ చేసుకున్నవారి జాబితా జతపరచమని వారు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిఫల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు ఇంటి నెంబర్లు మున్సిఫల్ అధికారులు కేటాయించడం, వారికి నల్లగొండ తహశీల్దార్ ఎటువంటి విచారణ జరుపకుండానే రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించారని పేర్కొన్నారు. అట్టి జాబితాలో తహశీల్దార్ బంధువులు, యం.ఎల్.ఎ. అనుచరులు ఉన్నట్లు తెలుస్తుందనీ, అట్టి స్థలములో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారని, వెంటనే తప్పుడు క్రమబద్దీకరణపై విచారణ జరిపి, రద్దు చేయడంతో పాటు దానికి బాధ్యులైన రెవిన్యూ, మున్సిఫల్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు
.
Comments
Post a Comment