భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో పేద ప్రజలకు ,అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే విధంగా ఉందన్న నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్


 

భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో పేద ప్రజలకు ,అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే విధంగా ఉందని నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మిగతా పార్టీల మేనిఫెస్టోలు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉన్నాయన్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల ఏజెంటు నూకల నరసింహ రెడ్డి లు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలను ఆదుకొని వారిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే విధంగా ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ట్యాగులైన సబ్కకా సత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ లను నెరవేర్చడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం తెలిపారు. తెలంగాణ రాష్టంలో సుపరిపాలన సమర్థవంతమైన పాలనపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి అనగారిక వర్గాల సాధికారిక సామాజిక న్యాయం జరిగే విధంగా కృషి చేయడమే బిజెపి లక్ష్యం అని తెలియజేశారు. ఇప్పటికే కేంద్రంలో మోడీ ప్రభుత్వం నారిశక్తి ద్వారా మహిళల అభివృద్ధి శ్రీకారం చుట్టడంతో పాటు రైతుల ప్రయోజనమే భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్ష్యంఅన్నారు . కూడు గూడు ఆహార భద్రత సొంతింటి కల తో పాటు ఉపాధి కల్పించడం, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. నల్గొండ లో అమితాషా సభ ను విజయంతం పట్ల కృతజ్ఞతలు తెలిపారు .టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆచరణ కు నోచుకోని హామీలు చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఎలక్షన్లకు వస్తున్నారని అన్నారు . ఈ సమావేశం లో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి,మీడియా ఇంచార్జ్ పెరిక మునికుమార్,పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బోగారి అనిల్ కుమార్, కొత్త పల్లి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్