ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిగారిని అత్యధిక ఓట్లతో గెలిపించండి - పాలడుగు
*ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిగారిని అత్యధిక ఓట్లతో గెలిపించండి*
ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ప్రజల వెన్నంటి ఉండే సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఈరోజు నల్లగొండ మండలం, దండంపల్లి అన్యపర్తి అప్పాజీపేట దోమలపల్లి నర్సింగ్ పట్ల దొనకల్లు కంచనపల్లి అనంతారం కొత్తపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఓట్లు లేవు గెలవరని అన్న రాజగోపాలరెడ్డి ఎర్ర జెండా మెడలో వేసుకుని తిరగడం సిగ్గుమాలిన చర్య అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో సిపిఎం ఆఫీస్ కి వెళ్లి ఓట్లు వేయమని అడగడం ఏమిటని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. రైతులు కార్మికులు వ్యవసాయ కూలీల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్టులేనని గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చింది కమ్యూనిస్టులేనని అన్నారు. దేశ చరిత్రలో రైతు వ్యతిరేక చట్టాలను బే శరత్ గా ఉపసంహరించుకొని రైతు పోరాటాల ఎదుట ప్రధాని మోడీ మెడలు వంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో సాగునీటి కై పోరాడి ఎస్ఎల్బీసీని సాధించింది కమ్యూనిస్టులేనని అన్నారు. కమ్యూనిస్టులు పోరాటం వలనే గ్రామాలలో ఇండ్ల స్థలాలు దక్కాయని అట్టి స్థలాలను చిన్నాభిన్నం చేశారని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం సిపిఎం మండల కార్యదర్శి నడపరాజు సైదులు కుమ్మరి శంకర్ దండు శంకర్ మండల కమిటీ సభ్యులు గోలి వెంకటమ్మ బొల్లు రవీందర్ కుమార్ పోలే సత్యనారాయణ వడ్డేపల్లి గోవర్ధన్ ముక్కామల యాదయ్య బొల్లోజు భారతమ్మ మంగదుడ్ల యాదయ్య మానుపాటి ఎల్లయ్య కట్ట అంజయ్య రుద్రాక్ష రాములు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment