బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి- బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్
బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి-
బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్
నల్గొండలో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని నల్గొండ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం నల్గొండ మున్సిపాలిటీ పరిధి 18,19 వార్డులో పానగల్ ఎల్లమ్మ టెంపుల్ మరియు SPT మార్కెట్లో గడపగడపకు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బీజేపీని ఆదరించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ కు అవకాశం కల్పించారని, ప్రజలంతా ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఒక్కసారి అసెంబ్లీకి పంపాలని కోరారు. గడపగడపకు వెళ్తున్న తరుణంలో ప్రజలంతా తమకు మద్దతిస్తున్నారని, నల్గొండ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పాలించిన పార్టీలు నల్గొండ అభివృద్ధిని పట్టించుకోలేదని, ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పంపితే నల్గొండను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు. నల్గొండ మున్సిపాలిటీ తో పాటు నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరెల్లి చంద్రశేఖర్ బండారు ప్రసాద్, యాదగిరి చారి, పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, పగిడి మహేష్ బీఎస్పీ ప్రసాద్, శ్రీకాంత్ ,పెరిక ముని కుమార్, ఆవుల మధు,ఏరుకొండ హరి, దినేష్ గౌడ్, వెంకటేష్ , సురేష్, ప్రశాంత్ ,సాయి, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment