*నల్గొండలో బిజెపి గెలుపే ధ్యేయంగా పని చేయాలి*
*నల్గొండలో బిజెపి గెలుపే ధ్యేయంగా పని చేయాలి*
*బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్*
*బిజెపి ప్రచారానికి అపూర్వ స్పందన*
*నల్లగొండ నవంబర్ 23*
నల్గొండ నియోజకవర్గంలో బిజెపి గెలిపిహంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కోరారు.
గురువారం నల్గొండ పట్టణంలోని 42, 38 వార్డులతో పాటు నల్గొండ మండలంలోని దొనకల్, కోదండపురం, చెన్నుగూడెం, పాత నర్సింగ్ భట్ల, నారబోయిన గూడెం, దోమలపల్లి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి నల్గొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, ప్రజలంతా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మద్దతు తెలుపుతున్నారన్నారు. నల్గొండ నియోజకవర్గంలో అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు కాషా జండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఇప్పటికే బీసీ సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు, ఎంఆర్పిఎస్ కూడా మద్దతు తెలపడం జరిగిందని, వారందరూ ఈ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేందుకు శాయా శక్తుల పని చేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి స్థానికులు కాదని, ఇతర నియోజకవర్గ నుంచి ఇక్కడ పోటీ చేసి నల్గొండ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్నారు. వారిద్దరికీ నల్గొండ అభివృద్ధిపై నిజమైన ప్రేమ లేదని, తాను నల్గొండ బిడ్డగా స్థానికుడిగా బరిలో ఉన్నానని ప్రజలంతా ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, గ్రామాల్లోకి వెళ్లిన సందర్భంలో అనేక సమస్యలను గుర్తించానని, పేదల బిడ్డగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈనెల 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment