నల్గొండలో బిజెపి బీసీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలి - బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్*-
*బిఆర్ఎస్, కాంగ్రెస్ లో బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం*
*నల్గొండలో బిజెపి బీసీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలి.
*బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్*
*నల్గొండ నవంబర్ 25*
*గత 70లుగా బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బీసీలకు సీట్ల కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందని బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అన్నారు.*
*శనివారం నల్గొండలోని బీసీ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలో ఓబిసి కమిషన్ పెట్టి బీసీలకు పెద్దపీట వేశారని, ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న బీసీ బిల్లు కోసం చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా గత మూడు నెలల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డతోపాటు బిజెపి అగ్ర నేతలను కలిసి R. కృష్ణయ్య బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తానని స్వయంగా బిజెపి అగ్రనేతలు ప్రకటించడం హర్షనీయమన్నారు. అందుకోసం నల్గొండ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి అయిన మాధగోని శ్రీనివాస్ గౌడ్ ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిజెపిలో ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే గతకుండేలుగా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతోపాటు ఆదుకుంటున్న నేత మాధగోని శ్రీనివాస్ గౌడ్ అని, కలెక్టరేట్ ముట్టడిలో పోలీసుల నిర్బంధాన్ని తట్టుకొని నమ్ముకున్న వారి కోసం పోరాటం చేసి జైలుకెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. నల్గొండ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రజల గుండెచప్పుడుగా నిలుస్తున్న మాధగోనిని ఆదరించాలని బీసీ సీఎం ఉంటేనే పార్లమెంటులో బీసీల సమస్యలపై కొట్లాడే పరిస్థితి ఉంటుందని వివరించారు. బిజెపిలో బీసీ సీఎంగా ఈటెల రాజేందర్ అయినా బండి సంజయ్ అయినా మరెవరైనా బీసీ అయితే బీసీ బిల్లు పార్లమెంటులో పాస్ చేయించేందుకు పోరాటం సులభం అవుతుందన్నారు. 70 ఏళ్ల చరిత్రలో బీసీని సీఎం చేస్తానని ఏ పార్టీ చెప్పలేదని ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే అధికంగా బీసీలకు బిజెపి అధిక సీట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో దళితుడిని సీఎం అని మాట తప్పిన కేసీఆర్ తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. గ్రూప్స్ నిర్వహణ, డీఎస్సీ ఇతర పరీక్షలను నిర్వహించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నీళ్లు, నిధులు, నియామకాల లో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యమయ్యాయని, బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక యువత నిర్వీర్యం అవుతుందని, టిఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత బీసీలంతా తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి బలపరిచిన బీసీ అభ్యర్థులను గెలిపించాలని, బీసీ వాదంతో ముందుకెళ్తున్న బీసీ వాదులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయని, బీసీలంతా గమనించి రాజ్యాధికారం కోసం బిజెపి బీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.నల్గొండలో మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అన్ని కోరడం జరిగింది.*
*ఈ సమావేశంలో బీసీ నాయకులు ఏరుకొండ హరి, ఖమ్మంపాటి శంకర్ దుర్గ, లోకేష్, సతీష్ కుమార్, జయేందర్, మోదాల శ్రీనివాస్ యాదవ్, వల్ల కీర్తి శ్రీనివాస్, శివ ముదిరాజ్ బిట్టు తదితరులు పాల్గొన్నారు.*
Comments
Post a Comment