*తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారంలోకి తేవాలి* - కేంద్రమంత్రి శోభా కరంద్లాజే-
*తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారంలోకి తేవాలి*
*ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలం*
*- కేంద్రమంత్రి శోభా కరంద్లాజే*
*నల్లగొండ నవంబర్ 27*
తెలంగాణ ప్రజలంతా ఆలోచన చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తెలంగాణలో డబ్బులు ఇంజన్ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కోరారు. సోమవారం నల్గొండ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆమె పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, యువకులంతా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెంద లేదని, సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సైతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలోని పల్లెలు, మునిసిపాలిటీలలో హరితహారం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, పార్కుల ఆధునీకరణ, రోడ్ల విస్తరణతో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల నిధులు విడుదల చేసిందని సీఎం కేసీఆర్ ప్రజలకు మోసపూరిత మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన, ఫసల్ బీమా యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, తోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ కమిషన్లకే సరిపోవడంలేదని కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంటుందని అన్నారు. నల్గొండ నుంచి బిజెపి అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామన్నారు. నల్గొండ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 31 ఏదైనా జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలను ప్రజలంతా ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. నాలుగు దఫాలుగా నల్గొండలో గెలిపించినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరికి పారిపోయారని, ప్రస్తుతం కోట్ల పేరుతో మీ ముందుకు వస్తున్నారని వారికి గుణపాఠం చెప్పాలన్నారు. గత ఐదేళ్లుగా నల్గొండలో ఎమ్మెల్యేగా గెలిచి పనిచేస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. నల్గొండ నియోజకవర్గ సంపాదన దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు, కోమటిరెడ్డి భూపాల్ రెడ్డి నల్గొండ బిడ్డలు కాదని, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి నల్గొండ సంపదను దోచుకుని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఉచిత హామీలను ప్రకటిస్తూ ఓట్లను దండుకుని కుట్ర చేస్తున్నాయన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు, మూడెకరాల భూమి, నిరుద్యోగుల భృతి నేటికీ అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో అధికార మదంతో విర్ర వీగుతున్న కేసీఆర్ దొర అహంకారాన్ని పారదోలేందుకు బిజెపికి ఓటు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాకముందు లిక్కర్ ఆదాయం ప్రస్తుతం 45 వేల కోట్లకు చేరిందని, తెలంగాణ రాష్ర్టం ప్రస్తుతం రూ. 5.50 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని, నల్గొండ ప్రజలకు నీరందించే ఎస్ఎల్బీసీ, ఎంఆర్పీ, ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు, కేసీఆర్ మాటలను మన నమ్మవద్దని, ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్,పొతేపాక సాంబయ్య,భూపాల్ రెడ్డి,కంకణాల నాగిరెడ్డి పెరిక ముని కుమార్, దాసరి సాయి, చర్లపల్లి గణేష్,ఏరుకొండ హరి, దాసరి సాయి, తదితరులున్నారు.
Comments
Post a Comment