అభివృద్ది పేరుతో కమీషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం - కేంద్ర సహాయ మంత్రి శోభా కరం



 తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి


 

అభివృద్ది పేరుతో కమీషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం


- కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే


నల్లగొండ నవంబర్ 28


తెలంగాణ రాష్ర్టంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కోరారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు అర్భన్కాలనీతో పాటు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వం ఆసరగా నిలిచిందని, అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, ప్రజలు ఉపయోగ పడే పథకాలను తెలంగాణ ప్రజలకు చేరవేడంలోరాష్ర్టం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలోని పల్లెలు, మునిసిపాలిటీలలో హరితహారం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, పార్కుల ఆధునీకరణ, రోడ్ల విస్తరణతో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు, విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం అభివృద్ధి పేరుతో కమిషన్ల పేరుతో దండుకున్నారని ఆరోపించారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీజేపీని అభివృద్ది తీసుకురావాలని, నరేంద్రమోడీ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళ్తామన్నారు. నల్గొండ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 30 ఏదైనా జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలను ప్రజలంతా ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. స్థానికేతరులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, నల్గొండపై వారికి ప్రేమ లేదన్నారు. మున్సిపాలిటీతో పాటు, నల్గొండ, కనగల్, తిప్పర్తి మండలాలలో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చిందని, బీసీ బిడ్డగా బీజేపీ అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరూ కమలం పువ్వుకు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.  


ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బండారు ప్రసాద్, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పొతేపాక సాంబయ్య, పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, శక్తి కేంద్ర ఇన్చార్జి ఏరుకొండ హరి, భూత అధ్యక్షులు సోమగుని దినేష్ గౌడ్ అనిమల్ యాదగిరి కంకణాల ఆదిరెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, దాసరి సాయి, పెరిక ముని కుమార్, దాసరి ప్రశాంత్ వరికుప్పల సాయి మల్లేష్ ఉపేందర్ రెడ్డి తదితరులున్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్