పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు డిసెంబర్ 27వ తేదీ లోగా సమర్పించాలి


 రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు డిసెంబర్ 27వ తేదీ లోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ రిటర్నింగ్ అధికారులను,సహయ వ్యయ పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు.

 శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సహయ వ్యయ పర్యవేక్షణ అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోటీ చేసిన అభ్యర్థుల ప్రతి రోజూ నిర్వహించిన అకౌంట్స్ రిజిస్టర్లు, క్యాష్ రిజిస్టర్లు, బ్యాంక్ రిజిస్టర్లు,సమగ్ర వివరాలను నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. సి 13 రిపోర్ట్స్, అనెక్సర్ లను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రొఫార్మాలలో నింపే విధానాన్ని రిటర్నింగ్ అధికారులు,సహయ వ్యయ పర్యవేక్షణ అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎన్కోర్ ద్వారా సంబంధిత డాటాను నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.




ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి అర్. కిరణ్ కుమార్, రిటర్నింగ్ ఆఫీసర్లు రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్