ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ 31 లోగా వానాకాలం 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ డెలివరీ పూర్తి చేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్




ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ 31 లోగా వానాకాలం 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ డెలివరీ పూర్తి చేసి ఎఫ్.సి.ఐ కి వెంటనే అప్పగించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్ కోరారు.


 బుధవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలం 2022-23 సీజన్లో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డెలివరీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.78లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్(93 శాతం) మిల్లర్ లు డెలివరీ చేశారని,మిగిలిన 20 వేల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు

  వానాకాలం పూర్తి చేసిన మిల్లర్ లు యాసంగి 2022-23 సి ఎం.అర్.డెలివరీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.యాసంగి 2022-23 సీజన్ కు సంబందించి 4.66 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్.కు గాను ఇప్పటి వరకు 1.04 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్.డెలివరీ చేశారని తెలిపారు.

ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లను అప్రమత్తం చేస్తూ పౌరసరఫరాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా రైస్ మిల్లర్ల వారిగా ఎన్ఫోర్స్మెంట్ టీం ల ద్వారా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.


 ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌసరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వరావు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు ,పౌర సరఫరాల డి.టి.లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్