రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం భీమా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు , ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం* "*మహాలక్ష్మి*"
**రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం భీమా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు , ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం*
"*మహాలక్ష్మి*"
*పథకాలను ప్రారంభించిన స్థానిక సంస్థల కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్*
నల్గొండ, డిసెంబర్ 09 :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన *మహాలక్ష్మి* పథకాలను జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల రూ.ల కు పరిమితి పెంపు పోస్టర్ ఆవిష్కరించి, పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుకు స్థానిక సంస్థల కలెక్టర్ పచ్చ జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి క్లాక్ టవర్ వరకు కలెక్టర్ సైతం బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో ఫేర్ తో కూడిన మహాలక్ష్మి టికెట్ లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడం పట్ల మహిళలు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ అర్.ఎం శ్రీదేవి, డి.ఎం. రాంమోహన్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.లచ్చు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డి.యం.హెచ్.ఓ డాక్టర్ వేణుగోపాల్, డి.అర్.డి. ఓ కాళిందిని,డి.సి.హెచ్.ఎస్. డా.మాతృ, మెప్మా పి.డి.కరుణాకర్,డి.పి.అర్. ఓ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment