జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు - జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్.వి.కర్ణన్



*జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు*


-

నల్గొండ, 01,  డిసెంబర్ 2023

నల్గొండ జిల్లాలో ఈ నెల 3 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్.వి.కర్ణన్ తెలిపారు.


తిప్పర్తి మండలం అనిశెట్టి ధుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం లో డిసెంబర్ 3 ఉదయం 8 గంటలకు

నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ,మును గోడ్,నకిరేకల్,నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్ట నున్నట్లు తెలిపారు. 


*లెక్కింపునకు ఏర్పాట్లు*


3న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం  ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తిప్పర్తి మండలం అనిశెట్టి ధుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం లో

 లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు


నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ,మును గోడ్,నకిరేకల్,నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు

 అసెంబ్లీనియోజక వర్గాలకు వేరు వేరు కౌంటింగ్‌ హాల్ లను ఏర్పాటు చేశారు.  ఒక్కో నియోజకవర్గంలో ఈవీఎం ల ఓట్ల లెక్కింపుకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.


 లెక్కింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లెక్కించనున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.


ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు.


*ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత*

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతి ఇస్తున్నారు. స్ట్రాంగ్ రూం ల వద్ద 24 * 7 పటిష్ట  నిఘా , భద్రతను ఏర్పాటు చేశారు.


ఈ.వి.యం.ల ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతి నియోజకవర్గం లో డ్రా ద్వారా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాల వి.వి. ప్యాట్ స్లిప్ లను లెక్కిస్తారు.లెక్కించిన తర్వాత తుది ఫలితం ప్రకటించడం జరుగుతుంది.


--------------------------------------------------------------

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్