భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డి
భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డి
మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించు కుంటు రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు,అభివృద్ధి పనులు గుర్తుచేసుకుని, 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని వీడుతున్నందుకు..ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా
*భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటా* అంటూ
ఫేస్ బుక్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అయన పోస్ట్ యధాతధంగా చదవండి.
భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఎంతో బరువైన హృదయం తో మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేయునది....
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బం..
నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చి టీఆర్ఎస్ ను గెలిపిస్తే నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని ప్రకటించారు. దీంతో ఆయన మాటలు నమ్మారు. మొట్టమొదటిసారిగా నేను ఓటమి చెందాను.
నాకు రాజకీయంగా అది ఒక సంధి దశ.
2019 లో లోక్ సభ ఎన్నికలొచ్చాయి. భువనగిరి ఎంపి స్థానానికి పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ అవకాశాన్ని ఒక సవాల్ గా తీసుకొని ఎన్నికల బరిలో నిలబడ్డాను.. అప్పుడు కూడా టీఆర్ఎస్, బిజెపి లు ఎన్ని ఎత్తుగడలు వేసినా, కుయుక్తులు పన్నినా.. భువనగిరి ప్రజలు నన్ను అక్కున చేర్చుకొని అండగా నిలబడ్డారు. సొంత అన్నలా ఆదరించి మంచి మెజారిటీ తో నన్ను పార్లమెంట్ కు పంపారు.
అప్పటి వరకూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్న నన్ను జాతీయ స్థాయి లో నిలబెట్టిన ఘనత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలదే.
ఇది ఒక రకంగా నాకు రాజకీయ పునర్జన్మ వంటిది.
*భువనగిరి అభివృద్ధి కోసం*
నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను పార్లమెంట్ కు పంపిన భువనగిరి ప్రజల ఋణం తీర్చుకోవాలనుకున్నాను.
అటు జాతీయ స్థాయిలో గానీ, ఇటు మన రాష్ట్రంలో గానీ మన పార్టీ అధికారంలో లేదు.
ఇది ఎంతో సంక్లిష్ట పరిస్థితి అని మీకు తెలుసు.
ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులకు అవకాశాలు చాలా తక్కువ.
ఇది నేను 2014 - 2018 మధ్యలో స్వయంగా అనుభవించాను.
*ఎన్నికల వరకే రాజకీయం ఉండాలి. ఆ తర్వాత ఏ ప్రభుత్వం అయినా, పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయాలి*
ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించి నల్గొండ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించలేదు.
భువనగిరి ఎంపి అయ్యాక నాకు మళ్ళీ ఇదే సమస్య ఎదురైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోయినా నేను నిరుత్సాహపడలేదు. లోక్ సభలో ఎన్నో ప్రజా సమస్యలు లేవనెత్తి చురుకైన పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నాను. ఈ క్రమంలో అత్యధిక ప్రశ్నలు(341) వేసిన తెలంగాణ ఎంపి గా రికార్డ్ సృష్టించాను.ఎంతో హుందాగా, క్రియాశీలక వ్యవహార శైలి వల్ల కేంద్ర మంత్రులు నన్ను గుర్తించి గౌరవించారు.
దీంతో తెలంగాణ కోసం ప్రత్యేకించి భువనగిరి కోసం ఎన్నో అభివృద్ధి పనులు సాధించాను.
* భువనగిరి ఎంపి గా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు*
🔸NH-930 P... హైదరాబాద్ ORR లోని గౌరెల్లి జంక్షన్ నుంచి కొత్త గూడెం, భద్రాచలం వరకు
🔸 NH -65..హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డును కలుపుతూ LB నగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 లైన్
🔸తెలంగాణ లో చేనేత క్లస్టర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లు... కేంద్ర ప్రభుత్వం లోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (NHDP ) కింద వీటిని మంజూరు చేయించాను . ఇందులో ఆధునిక చేనేత మిషన్ కు 80% కేంద్రం సబ్సిడీ ఇస్తే 20% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.
🔸 బీబీ నగర్ లో ఆధునాతన వసతులతో AIIMS ఆసుపత్రి ఏర్పాటు అయింది. కాగా అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం రు 970 కోట్లు శాంక్షన్ చేయించాను.
🔸 భువనగిరిలో క్రీడాభివృద్ధి కోసం 200 కోట్లు కేంద్ర నిధులతో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేయించాను.
అయితే కోమటిరెడ్డికి ఎక్కడ పేరొస్తుందో అని... బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కూడా కేటాయించకుండా ఆ నిధులను మురగ బెట్టింది. ఇప్పుడు పూర్తి చేయించి ఈ కాంప్లెక్స్ కు జీవం పోస్తాను.
🔸 రోడ్ల రూపంలో కావచ్చు.. వీధి దీపాలు కావచ్చు.. తాగునీటి వ్యవస్థ కావచ్చు.. భువనగిరి లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అభివృద్ధి కోసం నేను పాటు పడ్డాను.
🔸 కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రాబట్టడంలో నా పాత్ర ఎంతో ఉంది.
ఎం పి గా నేను సాధించిన విజయాలకు కారణం భువనగిరి ప్రజలే. అలాగే కేంద్రం నుంచి తెలంగాణ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగాను అంటే, అది భువనగిరి ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం వల్లనే సాధ్యమైంది.
అందుకే నేను భువనగిరి ప్రజలకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.
ఏ రాజకీయ నాయకుడికైనా కొన్ని అనివార్య పరిస్థితులు ఉంటాయి. నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్గొండ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గా పోటీ చేశాను.
నల్గొండ ప్రజలు నన్ను అఖండ మెజారిటీతో ఎన్నుకుని తెలంగాణ శాసనసభకు పంపించారు. మీ అందరి ఆశీర్వాదంతో నేను రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాను.కాబట్టి *ఎంతో భారమైన హృదయంతో ఈ రోజు నేను నా ఎం పి పదవికి రాజీనామా చేస్తున్నాను*.
అయితే, భువనగిరితో నాకు భావోద్వేగంతో కూడుకున్న అనుబంధం. ఈ బంధం నేటితో తీరేది కాదు.
ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్న నేను భువనగిరి ప్రజలను మర్చిపోలేను. మీకు ఏ అవసరం వచ్చినా నా తలుపు తట్టవచ్చు. మీ సేవకై నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను.
ఇట్లు
మీ అభిమాన పాత్రుడు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Comments
Post a Comment