*ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*


 *ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*


*నల్లగొండ*: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సీనిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతిక్ రెడ్డి 12వ వర్ధంతిని గురువారం నల్గొండ మండలం పెద్దసురారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ప్రతీక్ రెడ్డి ఫ్లెక్సీ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పెద్దలు ఏడుదొడ్ల కొండల్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి ఆర్థిక సహకారంతో 9, 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, నోటు బుక్స్ పంపిణీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిక్ ఫౌండేషన్ సీఈఓ మారం గొనరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

పేద విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు.

కార్యక్రమంలో తిప్పర్తి మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్స్ నాయకులు పిల్లి యాదగిరి, ఎంపీటీసీ పెండం రత్నమాల పాండు, ప్రధానోపాధ్యాయులు రాధకృష్ణ, ఉపాధ్యాయులు విజయకుమార్ ,సత్య బాబు, రమేష్, వనజాత,సైదులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్