సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం


 


సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్: 
నేడు నేషనల్‌ పెన్షనర్స్ డే సందర్భంగా మన సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము తెలంగాణ  టూరిజం ప్లాజా, హైదరాబాద్‍ నందు జరుగగా, ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా  విశ్రాంత మాజీ కమీషనర్‌

B. P. ఆచార్య IAS , విశ్రాంత మాజీ డైరెక్టర్  కిస్మత్‌ కుమారు , శ్రీ ప్రమోద రావు, సుభాష్ గౌడ్,  సత్యా రావు, మాజీ CIE శ్రీ రమేశ్‌ కుమార్‌  పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, 75 సంవత్సరాలు పూర్తి చేసిన విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించినారు. ఇట్టి కార్యక్రమమును మాజీ CIE  రమేశ్‌ కుమార్‌ USA  పూర్తిగా ఆర్థిక సహాయ సహకారాలు అందించినారు. ఈ కార్యక్రమమునకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగులు  అందరు పాల్గొని ద్విగ్విజయం చేసినారు.  మరియు  లాల్కోట వీరప్ప వ్రాసిన అమృతవాక్కులు - నిత్య సత్యాలు కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమ అద్యక్షత కిస్మత్‌ కుమారు నిర్వాహకులు విశ్రాంత CIE  విజయ భాస్కర్‌ రెడ్డి, విశ్రాంత DD శ్రీ రషీద్ లు సంయుక్తముగా నిర్వహించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్