వేతన ఒప్పందం లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం నిర్లక్ష్యం



 


*వేతన ఒప్పందం లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎరగాని నాగన్న తెలిపారు*. నాగన్న ఆదేశానుసారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నూతన వేతన ఒప్పందం చేయాలని నల్గొండ డీ,సీ,ఎల్ ,గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది,


విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఐ .ఎన్ .టి .యు .సి ., జిల్లా కార్యవర్గం విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అద్వర్యం లో కార్మిక శాఖా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు , యాజమాన్యం 2020 లో వేతన ఒప్పందం చేసుకుందని , ఆ ఒప్పందం 2023 తో ముగిసిందని , ఆతర్వాత నూతన ఒప్పందం చేయాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు . తక్షణమే నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు . లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు . ఈ కార్యక్రమం లో జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జమాలుద్దీన్ జిలాని కోటగిరి శేఖర్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు నూకపంగా రమేష్ వర్కింగ్ ప్రసిడెంట్ షేక్ ఖలీల్ , ప్రధాన కార్యదర్శి దూదిమెట్ల సందీప్ , జాయింట్ సెక్రెటరీ విజయ్ , చిట్టిబాబు , ఐ .ఎన్. టి .యు .సి . నాయకులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్