కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సీ.ఎం. రేవంత్ రెడ్డి ఫోన్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సీ.ఎం. రేవంత్ రెడ్డి ఫోన్
హైదరాబాద్, డిసెంబర్ 13 :: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు ఫోన్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలందించాలని సి.ఎం. కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉండేలా సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు.
Comments
Post a Comment