రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్ ఆండ్ సెలక్షన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్
నల్గొండ, dt.5.12.23
67 వ SGF ( స్కూలు గేమ్స్ ఫెడరేషన్) తెలంగాణా రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్ ఆండ్ సెలక్షన్స్ ను జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ప్రారంభించారు
14, 17 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్వహిస్తున్న కరాటే పోటీలను నల్లగొండ పట్టణం లోని ఇండోర్ క్రీడా ప్రాంగణంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి యువతకు ఎక్కువగా క్రీడా పోటీలు అవసరమని,క్రీడా పోటీల లో పాల్గొనడం ద్వారా మాత్రమే శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని అనారు.
తల్లిదండ్రులు చదువు మాత్రమే కాకుండా ఆటలపై కూడా బాల బాలికలను పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. కరాటే వలన వ్యక్తిగత ధైర్యంతో పాటు శారీరక దృఢత్వం అభివృద్ధి చెందుతుందని,.అందువలన బాలబాలికలందరూ పాల్గొనాలని అన్నారు. తను కూడా ప్రతిరోజు గేమ్స్ ఆడుతానని షెటిల్, వాలీబాల్ ఆడుతానని తెలిపారు బాలబాలికలు అందరూ ఏదో ఒక ఆటలలో పాల్గొనడం వలన శారీరక దృఢత్వం అభివృద్ధి చెందుతుందని, నేటి యువత ఎక్కువగా సెల్ఫోన్లతో టైమ్ స్పెండ్ చేస్తున్నందువలన శారీరక దృఢత్వం అనేది ఉండడం లేదు. కావున అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆటలలో పాల్గొనాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో
SGF సెక్రెటరీ G. వాసుదేవ రావు, నల్లగొండ జిల్లా కరాటే అసోసియేషన్ కార్యదర్శి దాసోజు నరసింహచార్యులు, మాజీ ఎస్.జి.ఎఫ్.కార్యదర్శి
నర్సిరెడ్డి, అబ్జర్వర్ లావణ్య , వ్యాయామ ఉపాధ్యాయులు వి. రవీందర్, విమల, నాగరాజు, ధర్మేందర్ రెడ్డి శంభు లింగం ,వెంకట్ ,శ్రీకాంత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బాలు ,బ్రహ్మయ్య, దేవేందర్ రెడ్డి, గఫార్, కవిత ,శ్రీనివాసరావు, యాదయ్య, షరీఫ్,కరాటే కోచ్ లు, వివిధ జిల్లాల కరాటే క్రీడాకారులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment