యాసంగి పంటల సాగు ప్రణాళిక సాగు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్


                                                            

#యాసంగి పంటల సాగు ప్రణాళిక సాగు పై సమీక్ష#
*జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్*
.        
యాసంగి లో పంటల సాగు ప్రణాళిక ప్రకారం రైతులకు ఎరువులు,పురుగు మందులు,నాణ్యమైన విత్తనాలు అందు బాటులో ఉంచాలని నల్గొండ  జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం  సమావేశ మందిరం లో యాసంగి లో పంటల సాగు ప్రణాళిక,
ధాన్యం కొనుగోళ్ల పై వ్యవసాయ శాఖ,
పౌర సరఫరాల శాఖ,జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ,సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
యాసంగి లో జిల్లాలో 4,80,000 ఎకరాల్లో సాగు అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు కలెక్టర్ కు వివరించారు. యానంగి పంటల సాగు ప్రణాళిక ననుసరించి రైతులకు కావలసిన రైతులకు నాణ్యమైన విత్తనాలు అంద చేయాలని అన్నారు..ఎరువుల డీలర్ ,సొసైటీ లు తనిఖీ చేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు అందేలా వ్యవ సాయ శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు
లక్ష ఎకరాల్లో వరి నారు వేసినట్లు,4వేల ఎకరాలు వరి సాగు,4 వేల ఎకరాలు వేరు శనగ సాగు చేసినట్లు అధికారులు వివరించారు.ప్రణాళిక ప్రకారం71 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా 24వేల యూరియా స్టాక్ నిల్వ లు అందుబాటు లో ఉండగా 7వేల మెట్రిక్ టన్నులు మండలం లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.రైతులు సన్న,దొడ్డు రకం యూరియా ఒకే విధంగా పని చేస్తాయని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు.
ఉద్యాన అధికారులు లక్ష్యం మేరకు ఆయిల్ ఫాం సాగు కు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్రంలో తూఫాను ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న ధాన్యం మొత్తం కొనుగోలు వేగవంతంగా  పూర్తికావాలని సూచించారు. వెంటనే ట్యాబ్ ఎంట్రి పూర్తిచేయాలని, కేంద్రాల్లో దాన్యం తడవకుండ టార్పలిన్లను కప్పాలని ఆదేశించారు. 
జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాల ద్వారా ఐ.కె.పి.98,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) 133,రైతు ఉత్పత్తి సంఘాలు(FPA)
11 కేంద్రాల ద్వారా 3,01,700 మెట్రిక్ టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి 583 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
జిల్లాలో 154 కొను గోలు కేంద్రాలు ఐ.కె.పి.74,PACS 79,FPA 8 కొనుగోలు కేంద్రాలు కొనుగోళ్లు పూర్తి చేసినందున క్లోజ్ చేసినట్లు అధికారులు వివరించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త్వరితగతిన కొనుగోలు పూర్తి చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యం
ట్యాబ్ ఎంట్రీ లు పూర్తి చేసి రైతులకు త్వరగా చెల్లింపు లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్, ఉద్యాన శాఖ అధికారి సంగీత లక్ష్మి,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌరసరఫరాల డి.యం.నాగేశ్వర రావు,
డిసిఓ కిరణ్ కుమార్,  తదితరులు పాల్గోన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్