పదవీ భాద్యతలు స్వీకరించిన తుమ్మల
పదవీ భాద్యతలు స్వీకరించిన తుమ్మల
హైదరాబాద్, డిసెంబర్ 15 :: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఉద్యానవన శాఖ కమీషనర్ హనుమంత రావు, సత్య శారద లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రి కి శుభాకాంక్షలందచేశారు.
Comments
Post a Comment