*క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి*
*క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి*
నల్లగొండ: విశ్వమానవాళికి తన ప్రేమ తత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు,ప్రేమమూర్తి క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా నల్గొండ నియోజకవర్గ, తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అత్యుత్తమ జీవన మార్గాలను మానవ సమాజానికి అందించి.. ఇతరుల కోసం జీవించడం అన్న కొత్త పలుకులను నేర్పిన క్రీస్తు జన్మదినం ఎంతో పవిత్రమైనది అన్నారు.ఏసుక్రీస్తు తన జీవితమే ఒక సందేశంగా జీవించిన కరుణామయుడని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తవులందరి జీవితాలలో వెలుగులు నింపాలని, క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Post a Comment