తిరుపతి మొక్కు తీర్చుకున్న అవినాష్*
*తిరుపతి మొక్కు తీర్చుకున్న అవినాష్*
వేముల వీరేశం ఎన్నికలలో గెలవాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కు కున్న ఆయన అభిమాని వంగాల అవినాష్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ కు నగరానికి చేరుకున్న అవినాష్ కుటుంబంతో సహా న్యూ ఎమ్మెల్యే క్వాటర్స్ లోని వీరేశం నివాసానికి వెళ్లి ఆయనకు ప్రసాదాన్ని అందజేశారు. ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ఏర్పాటు కోసం పాటుపడిన వీరేశం కు అప్పటి అధికార పార్టీ టికెట్ నిరాకరించగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అక్కున చేర్చుకొని నకిరేకల్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన వీరాభిమానులు ఆనందంలో మునిగితేలారు. తాము నిత్యం అభిమానించే నాయకుడిని గెలిపించాలని కుటుంబాన్ని వదిలి, ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరి సొంత గ్రామాలకు వెళ్లి వీరేశం కోసం ప్రచారం నిర్వహించారు. వారి కష్టం వృధా కాలేదు వీరేశం అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించి మరో మారు అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు.దీంతో సంతోషంతో వంగాల అవినాష్ ఆయన నమ్మే ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లి తిరిగి నేరుగా వీరేశం ఇంటికి చేరుకొని ప్రసాదం అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నిదాన్ పల్లి గ్రామ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి,మాజీ మండల అధ్యక్షులు గంగుల వెంకట్ రాజి రెడ్డి, మాజీ జడ్పిటిసి జినుకల ప్రభాకర్,గారు వెల్లంకి ఎంపిటిసి తిమ్మాపురం మహేందర్ రెడ్డి ఉన్నారు.
Comments
Post a Comment