'లై" డిటెక్టర్ పరీక్ష నేను సిద్ధం - మాజీ MLA క్రాంతి కిరణ్

 


దళిత బంధు లో కమీషన్లు తీసుకున్నానంటూ తనపై ఒక వ్యక్తి పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు నిన్న నే నా దృష్టికి వచ్చిందని, నిగ్గుతేల్చడానికి 'లై" డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని దానికి నేను సిద్ధం అని  మాజీ MLA క్రాంతి కిరణ్  స్టేట్మెంట్ యధాతధంగా చదవండి.

దళిత బంధు లో  కమీషన్లు తీసుకున్నానంటూ తనపై ఒక వ్యక్తి పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు నిన్న నే నా దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదు రాజకీయ కుట్ర, అయినప్పటికీ ఆరోపణలపై విచారణకు నేను సిద్ధంగా వున్నాను. అయితే నిజాలు నిగ్గుతేల్చడానికి 'లై" డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని దానికి నేను సిద్దాంగా ఉన్నానని కూడా తీయజేస్తున్నాను.  తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి కి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి ఫిర్యాదులోని వాస్తవాన్ని ఫిర్యాదు వెనకాల ఉన్న కుట్ర ను ఛేదించాలని పోలీస్ లను కోరుతున్నాను.

 ఆందోల్ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట. తప్పుడు కేసు లతో మా కార్యకర్తలను వేధిస్తున్నాడు. మా కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయిస్తున్నాడు. బి ఆర్ ఎస్ మహిళ కార్యకర్తల ఇళ్లలోకి జోరబడి వారిపై కోడి గుడ్లతో దాడి చేయిస్తున్నరు. నాయకుల ఇళ్ల పైకి టపాసులు విసురుకుంటు వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు, కార్ల కింద టపాసులు పేల్చుకుంటు దామోదర అనుచరులు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి రాయలసీమ ఫ్యాక్షన్ గ్రామాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు మా ఆందోల్ లో ఏ గ్రామంలో చూసిన ఇదే పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు గడవక ముందే మంత్రి గా అన్ని స్థాయిల్లోని అధికారులను బెదిరింపులతో తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ అధికారులను సైతం దామోదర బెదిరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రశాంతంగా పనిచేసుకొని పరిస్థితి ని దామోదర తీసుకొచ్చాడు. గ్రామాల్లో రాజకీయంగా  ఆయనకు దీటుగా నిలబడ్డందుకే తప్పుడు ఆరోపణలతో కేసు లు పెట్టిస్తున్నాడు. జీతం మీద మాత్రమే ఐదేళ్లు గడిపిన చరిత్ర నాది.  నేను ఎలాంటి వాన్నో నాతో కలిసి న ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా బదనాం చేయడమే లక్ష్యంగా కొందరిని లోబరుచుకుని, ప్రలోభపెట్టి  దామోదర దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.  నిష్పక్షపాత విచారణ జరగాలని నిజాలు నిగ్గుతేలాలని డిమాండ్ చేస్తున్న.

క్రాంతి కిరణ్

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్