Posts

Showing posts from 2024

*తెలంగాణ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సమీ.*

Image
 *తెలంగాణ గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ సమీ.* హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ 7వ వార్షిక సమవేశంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన అబ్దుల్ సమీ కి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు, అబ్దుల్ సమీ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ వ్యవసాయ విస్తరణ అధికారులుకు ఏ సమస్య వచ్చినా నేను పరిష్కారానికి దారి చూపిస్తానని, అదేవిధంగ నా యొక్క ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఒకే రోజు #ఏసీబీకి చిక్కిన ఇద్దరు

Image
 ఒకే రోజు ఏసీబీకి చిక్కిన ఇద్దరు 28-12-2024  శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "ఫిర్యాదిదారుడి సోదరి భూమిలో సర్వే చేసి అధికారిక సర్వే రిపోర్ట్ సమర్పించినందుకు గాను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ Merugu Rathnam, డిప్యూటీ సర్వేయర్, దమ్మన్నపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన ఎండ్రాల మల్లేశం, నాయబ్ తహశీల్దార్ 6,000/- లంచం మొత్తాన్ని వ్యవసాయ భూమిని నాలా మార్పిడి ఫైల్ ఫార్వర్డ్ చేయమని ఫిర్యాదుదారుడి నుండి డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. " 

విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక

Image
విజయవంతమైన ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక  హైదరాబాద్, డిసెంబర్ 25: ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక నిన్న హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో అతి ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెళ్లీడు ఉన్న ఆర్యవైశ్య అమ్మాయిలు మరియు అబ్బాయిలు సుమారు 110 మంది పాల్గొని పరస్పర పరిచయాలు చేసుకున్నారు. వాతావరణం సంపూర్ణంగా పెళ్లి వేడుకగా మారింది. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేదిక రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ముఖ్య అతిథులుగా రమేష్ గెల్లి గ మరియు తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత హాజరై తమ స్ఫూర్తిదాయకమైన మాటలతో కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించారు. రమేష్ గెల్లి మాట్లాడుతూ, జీవిత భాగస్వామి ఎంపికలో ఓపిక, సర్దుకుపోయే గుణం ముఖ్యమని హితవు పలికారు. శ్రీమతి కల్వ సుజాత ఈ సందర్భంలో మాట్లాడుతూ, భాగస్వామి ఎంపిక ఈ రోజుల్లో ఎంత కష్టమైనదో వివరించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆవోపా నిర్వాహకుల శ్రమను ప్రశంసించారు. సభాధ్యక్షులు నమశివాయ స్వాగత ఉపన్యాసంలో ఈ సంవత్సరంలో కొత్తగా ...

5లక్షల లంచం తో ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ డిపార్టుమెంటు అధికారి

Image
  5లక్షల #లంచం తో #ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ డిపార్టుమెంటు అధికారి వికారాబాద్, (గూఢచారి):  రహదారి భూమి (LF Road )ని పట్టా భూమిగా భూ వర్గీకరణ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.5,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్‌డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న "పరిపాలన అధికారి (AO) వై. దానయ్య & సీనియర్ అసిస్టెంట్  మాణిక్ రావు". “ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్. - అల్లు అర్జున్

Image
 *సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్.*   *ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది.*   *ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా :అల్లు అర్జున్‌.*  *సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా.*   *శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు.*   *20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా :అల్లు అర్జున్‌.* : *నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి..మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను.*   *నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు.*   *నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు :అల్లు అర్జున్‌.*  *థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు. మా వాళ్లు చెబితేనే ...

కిమ్స్ హాస్పిటల్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  • ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి • శ్రీతేజ్ చెయ్యి పట్టుకొని పిలిచి భావోద్వేగానికి లోనైన మంత్రి.. • శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడి బాబు యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి • ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల చెక్కును అందించిన మంత్రి.. • ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భాస్కర్ కు మంత్రి అభయం.. • భాస్కర్ భార్య రేవతి తన కాలేయాన్ని భర్తకు ఇచ్చి ప్రాణదానం చేసి.. తాను తనువు చాలించడం బాధకరమని తెలిపిన మంత్రి • యేడాది క్రితమే భర్త భాస్కర్ కు కాలేయం దానం చేసిన రేవతి • కాలేయ మార్పిడి ఖర్చులను సియంఆర్ఎఫ్ క్రింద ఇప్పించేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి • భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి • తండ్రిగా ఇద్దరు పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీమీద ఉంది.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ భాస్కర్ కు జాగ్రత్తలు చెప్పిన మంత్రి • అధైర్యపడొద్దు.. ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మంత్రి • సినిమాల వల్ల ప్రజలు సంతోషపడాలి కానీ ప్రాణాలు పోవడం బాధకరమన్న మంత్రి • శ్రీతేజ్ అవయవాల పనితీరు, కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందని డాక్టర్లను ఆరాతీసిన మం...

*CM కప్ 2024 నీ ప్రారంభించిన ఉప్పల*

Image
  *CM కప్ 2024 నీ ప్రారంభించిన ఉప్పల* హైద్రాబాద్:  ఉప్పల్ లోని ELITE GARAGE లో నిర్వహించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ సెలక్షన్స్ లో పాల్గొని పోటీలను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ 2024 నీ ప్రారంభించడం సంతోషం అని గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. మతాలకు అతీతంగా అందరూ కలిసే చోటు క్రీడామైదానం ఒక్కటే. యువత వ్యసనాల జోలికి పోకుండా క్రీడలవైపు మళ్లాలి. విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించాలి. మీకు అవసరమైన సహకారాన్ని ప్రజా ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు. ఈ పోటీల్లో అండర్ 15 మరియు 19 విభాగాల నుండి 100 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DYSO మేడ్చల్ మల్కాజ్ గిరి గోపాల్ , బ్యాడ్మింటన్ కోశాధికారి హర్ష యాదవ్ , ELITE Gamer's Garrage Management Vikanth Coach క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై దాడులు

Image
హోటల్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై దాడులు కాచిగూడ లో ముభారక్, నారాయణగూడ లో mehfil రెస్టారెంట్ లపై దాడులు... అన్నిట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారోత్పత్తులు, బొద్దింకలు, అపరిశుభ్రత.. అన్ని హోటళ్ళపై కేసులు నమోదు

ACB registered a case against KTR

Image
 ACB registered a case against KTR for alleged misuse of government funds under Sections 13(1)(A) and 13(2) of the Prevention of Corruption Act, along with Sections 409 and 120(B) of the IPC. It is alleged that ₹45 crore was paid by HMDA to the foreign company FEO in violation of RBI guidelines.  The payments were reportedly made without obtaining approvals from the Cabinet or the Finance Department. RBI imposed a fine of Rs. 8 crore on the then Telangana government for unauthorized transactions, which was later paid by the Congress government after coming to power.  KTR is accused of directing the misuse of authority, while IAS officer Arvind Kumar and EX HMDA Chief Engineer BLN Reddy are also implicated.  KTR has been named as A-1,  Arvind Kumar as A-2,  and  BLN Reddy as A-3 in the case.

ఏసీబీ నెట్ లో ఫారెస్ట్ అధికారి

Image
  ఏసీబీ నెట్ లో ఫారెస్ట్ అధికారి జగిత్యాల:  "కలపను తరలించడం కోసం నో ఆబ్జెక్షన్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.4500/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ & కత్లాపూర్ మండలానికి ఇంచార్జి - మొహమ్మద్ హఫీజుద్దీన్. "ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి అని ఎసిబి అధికారులు కోరారు.*

మాత శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
             మాత శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. Nalgonda,:        బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ ప్రసవం  సమయంలో, అలాగే ప్రసవానంతరం మాతృ మరణాలు,శిశు మరణాల వంటివి సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ తోపాటు, సంబంధిత శాఖల పై ఉందని అన్నారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వంటి కారణాల  వల్ల ఏ తల్లి బాధపడకూడదని చెప్పారు.  మాత ,శిశు మరణాలు సంభవించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.  మహిళ  గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు, అలాగే ప్రసవానంతరం కూడా పూర్తిగా  వైద్య ఆరోగ్యశాఖ,ఐ సి డి ఎస్ కనుసన్నల్లో ఉండేలా  నెలనెలా పరీక్షలు,ఇమునైజెషన్ , పౌష్టికాహారం వంటివి అందించాలని ,నిర్ధారిత సమయానికి ప్రసవం జరిగేలా చూడాలని, ప్రసవం సందర్భంగా ఎలాంటి జబ్బులకు గురికాకుండా తల్లిని అలాగే ప్రసవించిన తర్...

పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
 పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి *సనత్ నగర్ (ఎర్రగడ్డ)* *పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* * ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం కృషి చేస్తుంది. * యేడాది కాలంలో దాదాపు 1500 కోట్ల ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ లకు చెల్లించాం. * ఆరోగ్యశ్రీని పటిష్ట పరిచి పది లక్షలకు పెంచాం * పేదవారు కార్పోరేట్లకు పోయి చికిత్స తీసుకొని అప్పులపాలు కాకుండా ఉండేల టిమ్స్ ల నిర్మాణం * మాది స్కీంల ప్రభుత్వం – బీఆర్ఎస్ స్కాంల పార్టీ * మా టాప్ ప్రయార్టీ పేద ప్రజల సంక్షేమమే * *సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ నిర్మాణ పనుల పరిశీనానంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు*       పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సనత్ నగర్ (ఎర్రగడ్డ)లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజున గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సనత్ నగర్ (ఎర్రగడ్డ...

వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ 60వ జన్మదినోత్సవ సందర్భంగా సామూహిక బోజనాలు

Image
వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ 60వ జన్మదినోత్సవ సందర్భంగా సామూహిక బోజనాలు హైద్రాబాద్:  ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంటు, తన సేవా దృక్పథం ద్వారా అందరి మన్ననలు పొందిన కౌటికె విఠల్ గారు, తన పాలసీదారుల జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా ఒక నూతన ఆదర్శానికి నాంది పలికారు. ఈరోజు వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, కౌటికె విఠల్ గారు వెయ్యి మంది అన్నార్తులకు భోజన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, "నా విలువైన పాలసీదారులు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారి ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం ఉంది" అని తెలిపారు. ఈ ప్రత్యేక సేవా కార్యక్రమానికి తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్, శ్రీమతి కలువ సుజాత గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు చందా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.    చందా శ్రీనివాసరావు మాట్లాడుతూ, "తన పాలసీదారులపట్ల కౌటికె విఠల్ గారు చూపించే...

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కు ఘనంగా నివాళులు

Image
 అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కు ఘనంగా నివాళులు నల్గొండ:  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం రామగిరి నందు వారికి పలువురు నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు తేలు కుంట్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్,అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు,మాజీ అధ్యక్షులు వీరేల్లి కృష్ణయ్య, రేపాలా భద్రాద్రి రాములు, లకుమారపు శ్రీనివాస్, మీడియా చైర్మన్ సోమా చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు - MLC కవిత కల్వకుంట్ల

Image
 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు - MLC కవిత కల్వకుంట్ల *తెలంగాణ గుర్తింపును నిర్వీర్యం చేస్తున్నందుకు కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు,  సోనియా మరియు ప్రియాంక గాంధీ నుండి జవాబుదారీతనం డిమాండ్* *కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ‘కాంగ్రెస్ మాత’గా పిలవాలి: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల* *బతుకమ్మను, బీసీ వర్గాన్ని అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని BRS నాయకురాలు MLC K. కవిత డిమాండ్* *అసలు తెలంగాణ తల్లి ప్రతి గ్రామానికి చేరాలి: MLC K. కవిత* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు : MLC కవిత కల్వకుంట్ల* హైదరాబాద్, డిసెంబర్ 14 2024: తెలంగాణ సంప్రదాయాలు, పండుగలు, అస్తిత్వాన్ని అణగదొక్కుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంతోపాటు తెలంగాణ అహంక...

తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం పై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

Image
తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం పై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం *నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం* *సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం  ప్రారంభంకానున్న సమావేశం* *రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు & బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమ కారులు మరియు ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ సంఘాల నాయకులు* *తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం.. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విష సంస్కృతి తీసుకురావడం.. తెలంగాణ అస్తిత్వం పై దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి ఏకం కానున్న తెలంగాణ సమాజం*

వాయు కాలుష్య నియంత్రణకు సమిష్టిగా ముందుకు పోవాలి - NCAP పై సమీక్ష లో పిలుపునిచ్చిన మంత్రి సురేఖ

Image
  వాయు కాలుష్య నియంత్రణకు సమిష్టిగా ముందుకు పోవాలి - NCAP పై సమీక్ష లో పిలుపునిచ్చిన మంత్రి సురేఖ  హైద్రాబాద్, డిసెంబర్ 13, (గూఢచారి) :  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధిత అన్ని శాఖలు సహాయ, సహకారాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్ లోని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పై సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిగింది.   ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టిజి పిసిబి మెంబర్ సెక్రటరీ రవి, సిఈఈ రఘు, జెసిఈఎస్ సత్యనారాయణ, ఎస్ఈఎస్ డి. ప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వ ప్రసాద్, నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సిడిఎమ్ఎ జాయింట్ డైరక్టర్ సంధ్య, టిజిఈఆర్ టిసి ఈడి మునిశేఖర్, అగ్రికల్చర్ జెడి ఆశా కమారి,...

ఖమ్మం జిల్లా, జిల్లా ఖజానా కార్యాలయం, సీనియర్ అకౌంటెంట్ ACB నెట్‌లో

Image
   ఖమ్మం జిల్లా, జిల్లా ఖజానా కార్యాలయం, సీనియర్ అకౌంటెంట్ ACB నెట్‌లో   19-10-2024న, కట్ట నాగేశ్, సీనియర్ అకౌంటెంట్, జిల్లా ఖజానా కార్యాలయం, ఖమ్మం జిల్లా మీద ACB misconduct కేసు నమోదు చేసింది. అధికారిక అనుకూలత చూపించడానికి, అంటే RPS జీతం స్థిరీకరణ, సేవా పెన్షన్, గ్రాచ్యుటీ, పెంచిన కుటుంబ పెన్షన్, సాధారణ కుటుంబ పెన్షన్ బిల్లులు మరియు దాత గడువు మృతుల చెల్లింపులు, మొత్తం రూ. 3,92,960/- సంబంధిత బిల్లుల నుండి రూ. 40,000/- లంచం కోరాడు.బిల్ మొత్తం యొక్క 10% ను కమిషన్‌గా కోరాడు. అందువల్ల, తన విధిని తప్పుగా మరియు అవినీతిపరంగా నిర్వహించి, అన్యాయ ప్రయోజనం పొందాడు. సెక్యూరిటీ కారణాల వల్ల ఫిర్యాదుదారుల వివరాలు వెల్లడించడం లేదు. కట్ట నాగేశ్, సీనియర్ అకౌంటెంట్, జిల్లా ఖజానా కార్యాలయం, ఖమ్మం జిల్లా, అరెస్టు చేయబడ్డాడు. మరియు SPE & ACB కేసుల కోసం గౌరవనీయ III అదనపు సెషన్స్ జడ్జ్ వరంగల్ ముందు ప్రవేశ పెట్టారు., . కేసు విచారణలో ఉంది.   ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినట్లయితే, ప్రజలు చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారు...

సిపిఐ(ఎం) తోనే నగర సమస్యలు పరిష్కారం...

Image
 *సిపిఐ(ఎం) తోనే నగర సమస్యలు పరిష్కారం...*   నగర సమస్యలపై దశల వారి ఆందోళనలు  అర్హులైన వారందరికీ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి విలేకరుల సమావేశంలో సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్  ఖమ్మం నగరంలోని సమస్యలు సిపిఐ(ఎం) తోనే పరిష్కారాలు అవుతాయని , ప్రజలను భాగస్వాములను చేసి నగరంలో ప్రజా పోరాటాలు ఉదృతం చేస్తామని సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధిలో సిపిఎం పాత్ర ఎంత ఉందని, చిర్రావూరి లక్ష్మీనరసయ్య దగ్గర నుండి నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సిపిఎం మాత్రమేనని అన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో నగరంలోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి కేవలం 3500 మందికి మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, నగరంలో సుమారు 20వేల మంది వరకు అర్హులైన వారు ఉన్నారని, వారికి గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో అర్హులైన నిరుపేద, మధ్యతరగ కుటుంబాలకు ఇండ్లు ,ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డు...

పుష్ప 2నిర్మాత లకు బెదిరింపులు...

Image
 పుష్ప 2నిర్మాత లకు బెదిరింపులు... పుష్ప సినిమా లో షెకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ని నెగిటివ్ గా చూపించి తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారు అని క్షత్రియ కర్ణ సేన లీడర్ రాజ్ షేకవత్ ఆగ్రహం వ్యక్తం చేసారు, కర్ణి సైనుకుల్లారా సిద్ధంగా ఉండండి నిర్మాత ల పై దాడి చేద్దాం అని ఆయన పిలుపు ఇచ్చారు

SETWIN నల్లగొండ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి ఉపాధ్యాయులు ఎంపిక కు దరఖాస్తులకు ఆహ్వానం

Image
 SETWIN నల్లగొండ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి ఉపాధ్యాయులు ఎంపిక కు దరఖాస్తులకు ఆహ్వానం నల్గొండ:  ఈ నెల 7వ తేదీన నల్గొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన SETWIN వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సుమారు ( 26 ) కోర్సులలో శిక్షణ అందించడానికి కావాల్సిన యంత్ర పరికరాలను ఇతర పనిముట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా కోర్సులలో శిక్షణ అందించడానికి ఈ క్రింది అంశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేయాలనీ నిర్ణయించడం జరిగిందని SETWIN మేనేజింగ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.  పై కోర్సులకు సంబంధించి అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 18 వ లోపు సెట్విన్ శిక్షణ కేంద్రం, కేపీఆర్ కాలేజీ వద్ద, దేవరకొండ రోడ్డు, నల్గొండ వద్ద అన్ని పనిదినాలలో సంప్రదించి దరఖాస్తులను లేదా కేంద్రం ఇంచార్జి M. సరిత ఫోన్ నెంబర్ 9705041789 ద్వారా ఇతర వివరాలు పోందవచ్చనీ, ఆయా కోర్సులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు రూ.15 వేల నుండి రూ.20 వేల ...

మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు.

Image
  మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు. రంగారెడ్డి:  గతంలో  DE దివ్య జ్యోతి ఎదురుకుంటున్న అవినీతి ఆరోపణలపై మణికొండ మున్సిపల్ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. దివ్య జ్యోతి చేసిన ప్రతి సంతకాల పేపర్ ఫైల్ ను పరిశీలించడానికి తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు.

15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతీ సెక్రెటరీని

Image
 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతీ సెక్రెటరీని  సంగారెడ్డి : రూ.15వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రెటరీని తెలంగాణ ఏసీబీ పట్టుకుంది బ్యాంకు రుణం పొందేందుకు 'నో డ్యూస్ సర్టిఫికేట్' ఇవ్వడానికి నిందితుడు ఒక వ్యక్తి నుంచి లంచం మొత్తాన్ని డిమాండ్ చేశాడు. లంచం డిమాండ్ చేసి, అందుకుని మహదేవ్‌పూర్ గ్రామం సంగారెడ్డి పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తెలంగాణ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ పొందడంలో సహాయపడటానికి 'నో బకాయిలు లేని సర్టిఫికేట్'ని జారీ కొరకు లంచం తీసుకున్నాడు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Image
  తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రాబాద్: ఫాం హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ , ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు*

108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగ....

Image
  *హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో  చేజింగ్,ఫైటింగ్...* హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగ.... దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు... హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన దొంగ... అంబులెన్స్ సైరన్ తో రయ్ రయ్ మంటూ అతి వేగంతో పరారవుతున్న దొంగ. . చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయిన దొంగ.... జాన్ రెడ్డి పరిస్థితి విషమం,చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.. కేతేపల్లి (మం)కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయిన కేటుగాడు... సూర్యాపేట (మం)టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు... పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.

తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు.. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించిన కేంద్రం

Image
 తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు.. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించిన కేంద్రం తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది.  ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్య సాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం

Image
 *నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం* *కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల* కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు ఇస్తే ఆరు నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులు తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగింపు కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబసభ్యుల ఫోటోలు, వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని వేధింపులు న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసి పోయిన నాగరాజు కుటుంబం దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపిస్తున్న నాగరాజు దుకాణాలు 2022 లో నిర్మాణం జరిపితే 2018 లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆరోపిస్తున్న నాగరాజు కోర్టులో కేసు ఉండటంతో చేతులు ఎత్తేసిన పోలీసులు తన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని నాగరాజు ఆరోపణ నాగరాజు వీడియో బయటకు రావటంతో ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు ఆచూకీకోసం వివరాలు సేకరిస్తున్న పోలీసులు *నాగరాజు విన్నపం* దుకాణాలు బాడుగకు ఇవ్వడం మేము చేసిన తప్ప, కాలి చెయ్యమని అడిగినందుకు చంపుతామని బెదిరింపులు న్యాయం జరగకపోవడంతో కు...

RBI నగదు నిల్వల నిష్పత్తిని 50 bps తగ్గించింది

Image
  RBI నగదు నిల్వల నిష్పత్తిని 50 bps తగ్గించింది*  *CRRలో తగ్గింపు రెపో రేటుపై నేరుగా ప్రభావం చూపకుండా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతునిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని ఇంజెక్ట్ చేస్తుంది. డిసెంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025 మధ్య CRRలో 50-బేసిస్ పాయింట్ కట్‌కు బలమైన అవకాశం ఉంటుందని చౌదరి అంచనా వేస్తున్నారు, దీనిని 4.5% నుండి 4%*కి తగ్గించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) శుక్రవారం నగదు నిల్వల నిష్పత్తి లేదా CRRని 50 bps నుండి 4%కి తగ్గించింది. ఈ పదవీకాలానికి సంబంధించి తన చివరి ప్రసంగం ఏమిటో గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. CRR అనేది బ్యాంకు డిపాజిట్లలో ఒక శాతం, దానిని తప్పనిసరిగా RBI వద్ద నిల్వలుగా ఉంచాలి. ఈ ప్రకటన తర్వాత బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్లు గ్రీన్‌గా మారడంతో స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. బ్యాంకింగ్ గేజ్ నిఫ్టీ బ్యాంక్ ఉదయం 10:35 గంటల ప్రాంతంలో 0.13% లేదా 69 పాయింట్ల లాభంతో 53,672.75 వద్ద ట్రేడవుతోంది, ఇది రోజు కనిష్ట స్థాయి 53,160.65 నుండి U-టర్న్ చేసింది. ఇంతలో, ఈ సమయంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బర...

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Image
రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి *మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో*   సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. హైదరాబాదులో కొణిజేటి రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం! శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య మాకు ఇచ్చారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడింది..  చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీ గా మాట్లాడేందుకు నేను భయపడ్డాను.. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారు..  ప్రతిపక్ష సభ్యుడి నైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు..  ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు... చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది..  ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు...