ఈ నెల 28 న నల్గొండ లో మహిళా శక్తి సమ్మేళనం.
ఈ నెల 28 న నల్గొండ లో మహిళా శక్తి సమ్మేళనం.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ
మహిళలలో చైతన్యం కలిగించటం ద్వారా భారతీయ సంస్కృతి కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్నిపెంచడం వివిధ రంగాలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనడం మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంఅనే ఉద్ధేశముతో ' మహిళాశక్తి సమ్మేళనం ' ఏర్పాటు చేయడమైనదని మహిళాశక్తి సమ్మేళన నిర్వహులు తెలిపారు.
మహిళాశక్తి, సమ్మేళనంలో పాల్గోందాం – వైభవోపేతమైన సమాజాన్ని నిర్మిద్దాం మని మహిళ లోకానికి పిలుపు నిచ్చారు. విద్య, వైద్య సామాజిక, ధార్మిక, ఉద్యోగ, సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక, రాజకీయ, పత్రికారంగాలలో పనిచేస్తున్న మహిళలు, కళాశాల
విద్యార్థినీలు, కళాకారులు, క్రీడాకారులు, మరియు పొదుపు సంఘాల మహిళలు అందరూ ఆహ్వానితులే నని వారు తెలిపారు.
తేది. 28 - 01- 2024, ఆదివారం
సమయం : ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 4-00 గంటలకు వరకు
వేదిక :
గుండగోని మైసయ్య కన్వెన్షన్,
గంధంవారి గూడెం రోడ్, నల్లగొండ.
Comments
Post a Comment