ACB అదుపులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ
ACB అదుపులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ
బాలకృష్ణ ఆదాయానికి మించి నుంచి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలకే సోదాలు చేసి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరు పరుస్తామని ACB అధికారులు తెలిపారు.
సోదాల్లో భారీగా ఆస్తులు, మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు. నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు. నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల నగదు స్వాధీనం. హైదరాబాదులో విల్లా లు..ఫ్లాట్లు తో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు. బాలకృష్ణ ఇంటి తోపాటు బంధువులు మిత్రులు కంపెనీలో సోదాలు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం. 80 కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు కూడా స్వాధీనం. పెద్ద మొత్తంలో ఐఫోన్లను సీజ్ చేసిన అధికారులు. 90 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలు స్వాధీనపరచుకున్న అధికారులు కొడకండ్లలో 17 ఎకరాలు.. కల్వకుర్తిలో 26 ఎకరాలు.. యాదాద్రి లో 23 ఎకరాల ..జనగామలో 24 ఎకరాల లాంటి పత్రాలు స్వాధీన పరుచుకున్నారు. భూములు అన్ని కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తింపు. బాలకృష్ణ బినామీలను కూడా ప్రశ్నిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. వాళ్ళ ఆర్థికబిసోమవారం వెరిఫై చేస్తామని అధికారులు తెలిపారు. పలు కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నట్లుగా గుర్తించారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించిన బాలకృష్ణ.
రేరాలో సెక్రెటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్స్ సంస్థలకు లబ్ధి చేకిచ్చినట్టు ఆరోపణ..
ఇప్పుడు వరకు ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలను పూర్తిగా వెరిఫై చేస్తున్నామని అధికారులు తెలిపారు...
కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఏసిపికి సహకరించలేదనీ,
బాలకృష్ణను కోర్టులో పరిచి తిరిగి కస్టడీ లోకి తీసుకుంటామని తెలిపారు.
Comments
Post a Comment