రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు



 రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. డిజిపి రవిగుప్త, అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐ జి పీ లు స్టీఫెన్ రవీంద్ర, ఎం. రమేశ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు.


ఇంటెలిజెన్స్ కార్యాలయంలో....

ప్రభుత్వ సూచనల మేరకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఇంటెలిజెన్స్ శాఖ కార్యాలయంలోనూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, ఓఎస్డీ శివకుమార్, ఎస్పీలు శ్రీధర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్