వైద్య కళాశాల లో రోగులకు వైద్య సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం - ఆర్&బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ వైద్య కళాశాల లో రోగులకు వైద్య సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఆర్&బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి లో క్రిటికల్ కేర్ బ్లాక్ భవనానికి భూమి పూజ చేసిన అనంతరం మెడికల్ కళాశాలలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిం డెంట్,విద్యుత్ శాఖ అధికారులతో వైద్య కళాశాలలో సౌకర్యాలు,సమస్యల పై
సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణం పనులపై సమీక్షించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెడికల్ కళాశాలకు కావలసిన వైద్య పరికరాలు,మౌలిక సదుపాయాలు ఫిబ్రవరి నెలాఖరు లోగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు . మెడికల్ కళాశాలలో ఈ లైబ్రరీ కోసం 40 కంప్యూటర్లు తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. డెల్ కంప్యూటర్స్ ఏర్పాటుకు నిధులు చెల్లించి వారంరోజుల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్టు, అదే విధంగా సర్జరీ చేసిన తర్వాత స్టర్లిలైజ్ చేసే
ఆటో క్లేవ్,బ్లడ్ బ్యాంక్ అభివృద్ది కి తన స్వంత నిధులు మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.మెడికల్ కళాశాల కు ల్యాప్రో స్కోపిక్ మెషిన్,ఇతర
సంబంధించిన సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్,టి.ఎస్.ఎం.ఎస్. ఐ డి.సి.,ఎండి అర్.వి.కర్ణన్ తో ఫోన్ లో మాట్లాడి అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో వైద్య కళాశాలలో కరెంటు కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ నియోజక వర్గం లో కూడా కరెంటు సమస్య లేకుండా నిధులు మంజూరు చేయనున్నట్లు అందుకు కావాల్సిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు.మెడికల్ కళాశాల లో
తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులను గుర్తించి తనకు వారి వివరాలు అందించాలని, అటువంటి వారికి తాను ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు.
ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమారి,వైస్ ప్రిన్సిపాల్ డా. నిత్యానంద,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, ఆసుపత్రి సూపరిoటెండెంట్ డా. లచ్చు, ఎస్పీడీసీఎల్ ఎస్ .ఈ.
చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment