జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు
75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా
నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ 200 సంవత్సరాల పోరాటం,ఎందరో మహనీయులు త్యాగం పలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు.
భారత దేశం రాజ్యాంగ విలువలు కాపాడుతూ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు,జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాలూ మాస్టర్ ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.జిల్లా అధికారులు డి.యం.హెచ్. ఓ డా.కొండల్ రావు తన పాటలతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.ఆయన పాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజెన్ లను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
కార్యక్రమానికి ఎస్.పి.చందన దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లాక్ష్మా రెడ్డి,అర్ డి. ఓ రవి,రిటైర్డ్ ఐ. ఏ ఎస్.అధికారి చోల్లెటి ప్రభాకర్,డి.సి.సి.అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా అధికారులు హాజరు అయ్యారు.
Comments
Post a Comment