చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం
చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం
నల్లగొండ జిల్లాలో చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం సమర్పించారు శుక్రవారం నాడు మంత్రి స్థానికంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా చిన్నపత్రికల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది .జిల్లా కేంద్రంలో సుమారు 50 మందికి పైగా చిన్న దినపత్రికలతో పాటు మాస పక్ష వారపత్రికలు నడుపుతున్నారని వారు తెలిపారు గత కొన్ని దశాబ్దాలుగా చిన్న పత్రికలు నిర్వహిస్తూ ఆర్థిక భారంతో సతమగుతమవుతున్నారని సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారని చెప్పారు ఒక వైపు పత్రిక నిర్వహణ మరొకవైపు తన కుటుంబ పోషణ భారాన్ని భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు పాత్రికేయుల పట్ల పక్షపాతిగా పేరున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో చిన్నపత్రిల వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి పత్రిక బాంధవుడుగా పేరు తెచ్చుకోవాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాదీనం, సోమవారపు యాదయ్య, ఎండీ.మక్సుదు, వెన్నమల్ల రమేష్ బాబు, అబ్బోజు మదనాచారి, గంగాధర వెంకటేశ్వర్లు, అశోక్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment