ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రధాని మోదీ లక్ష్యం - కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే


 



ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రధాని మోదీ లక్ష్యం


అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి కి కృషి


వికసిత్ భారత్ తో ప్రతి గ్రామానికి కేంద్ర పథకాలు


కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే


పులిచర్లలో పర్యటన


జనవరి,19 : భారత దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ది చెందిన దేశంగా నిలబెట్టడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యం అని కేంద్ర భారీ పరశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందించడం వికసిత్ భారత్ లక్ష్యం అని తెలిపారు. దేశంలో 2.7 లక్షల గ్రామాలలో వికసిత భారత్ వెళ్తుంది అని చెప్పారు. మోడీ హయాంలో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 కోట్ల ఖర్చుతో అఖిల భారత వైద్య విద్య సంస్థ( ఏయిమ్స్) నిర్మించింది అని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులు 2500 కిలోమీటరు నుంచి 5000 కిలోమీటర్లు, రైల్వే లైన్లు రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పేద మహిళకు ఉచితంగా ఉజ్జ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చి మహిళల కష్టాలు తొలగించినట్లు పేర్కొన్నారు. 


దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు లక్షాది కారుల్ని చేయడం ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రకటించారన్నారు. అయుష్మాన్ భారత్ కింద పేదలందరికీ రూ. 5 లక్షల వరకు ఉచింతంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. 


కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పథకాల లబ్ది దారులతో ఆయన నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. 



వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రచురించిన కరపత్రాలు, 2024 క్యాలెండర్ ఆవిష్కరుంచారు. పులిచర్ల గ్రామం నుంచి ఎదిగి రగ్బి క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగిన షా మినిని ఆయన సత్కరించారు. 


కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజీఎం ప్రశాంత్ కుమార్ బరియార్, రీజనల్ మేనేజర్ అలీముద్దిన్, జిల్లా బ్యాంకు నోడల్ అధికారి శ్రామిక్, నాబార్డు జిల్లా మేనేజర్ వినయ్ కుమార్, ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర్ రావు, డీఆర్డిఓ కాళిదిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కొండల రావు , అర్ డీ వో చెన్నయ్య, ఐసీడీఎస్ పీడీ కృష్ణ వేణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్