*KVPS మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*


 


*KVPS మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరించిన  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*



   సమాజంలో వేలునుకున్న అసమానతలు కుల వివక్షకు వ్యతిరేకంగా తమ జీవితాంతం పోరాడిన మహనీయులు సామాజిక తత్వవేత్తలు మనందరికీ మార్గదర్శకులని, ఆ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ ముందుకు సాగుతూ సామాజిక ఉద్యమాలు చేయడం అభినందనీయమని రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. 

   సోమవారం రోజున నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  చేతుల మీదుగా కెవిపిఎస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కెవిపిఎస్ జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేవిపియస్ నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమాలు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, ప్రతిఘటన శక్తిని పెంపొందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం కెవిపిఎస్ పోరాటాలు నిర్వహించి అనేక చట్టాలను సాధించిందని అన్నారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా రావలసిన నిధులు పక్కదారి పడుతున్నాయని దళిత గిరిజనులకు అందవలసిన నిధులను దారి మళ్లించకుండా దళితుల అభ్యున్నతికే ఖర్చు చేయాలని అన్నారు. 

నేటికీ కొనసాగుతున్న కులవివక్ష అంటరానితనం సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా కెవిపిఎస్ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను రాష్ట్ర కమిటీ సభ్యులు పరుష రాములు జిట్టా నాగేష్ కోడి రెక్క రాధిక చేతివృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ జిల్లా ఆఫీసు బేరర్స్ దైద శ్రీను గాదే నరసింహ బొల్లు రవీందర్ ఒంటెపాక కృష్ణ చిలుముల రామస్వామి దండు రవి తక్కెళ్ళపల్లి శ్యామ్ దైద దేవయ్య దున్న అచాలు బొల్లంపల్లి రవి మేకల వెంకన్న కొత్త ప్రసాదు మాతంగి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్