MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామం లో ఉన్న MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణకొరకు జనవరి 19న జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేసినట్లు నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎనివిరామెంటల్ ఇంజనీర్ పి. సురేష్ బాబు తెలిపారు. అనివార్య కారణంగా వాయిదా పడిందనీ, తదుపరి విచారణ తేదీ తర్వాత తెలియజేయబడుతుందనీ అయన తెలిపారు.
వెలిమినేదు గ్రామ ప్రజలు, వివిధ సంఘాలు గత రెండు రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపవద్దని, MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ చేపడితే కాలుష్యం పెరిగి గ్రామాల్లో నివసించడానికి ఇబ్బందులు ఎదురు అవుతాయని పెద్ద యెత్తున ఉద్యమం, ధర్నాలు చేపట్టి ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర ఏర్పాట్లు ను తొలగించడం తో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.
ఈ విషయం పై ఆ ఇండస్ట్రీ మేనేజర్ మాట్లాడుతూ ప్రజల కొరకు ఉద్యమం కాదు. ఈ ఉద్యమం వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని అని అన్నారు.
ఈ పరిశ్రమ విస్తరణ కొరకు ఇచ్చిన పేపర్ ప్రకటన లో కన్సల్టెంట్ గా వ్యవహరించిన పాయినర్ ఎన్విరో కన్సల్టెంట్ వారు యొక్క ఫోన్ నంబర్ లాండ్ లైన్ ది ఇచ్చారు. అది పని చేయ లేదు. ప్రజల తో మాట్లాడ డానికి, వారి సందేహాల నివృత్తి కొరకే ఫోన్ నంబర్ పేపర్ ప్రకటనలో ఇస్తారు. అలా కాకుండా పని చేయని నంబర్ వేసి ప్రజల కు అందు బాటులో లేకుండా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం వుతుంది.
Comments
Post a Comment