సేవాలాల్ 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ
సేవాలాల్ 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ
నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు సంత్ సేవాలాల్ 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకు వృద్ధులకు మరియు బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సదర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ సంతు సేవాలాల్ గిరిజనుల ఆరాధ్య దైవం ఆయన గిరిజనుల కోసమై పెద్ద ఎత్తున వారికోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో నిన్న వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు సంతు సేవాలాల్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్ మరియు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ చిత్రం శ్రీను విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వంగాల బిక్షమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నవీన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు .....
Comments
Post a Comment