అడవిలో చిరుత పులి మృత్యువాత
*అడవిలో చిరుత పులి మృత్యువాత*
*షాద్ నగర్ నియోజక వర్గం పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామ అడవిలో ఘటన*
*సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు.
Comments
Post a Comment