మార్కెట్ చైర్మన్ అరుణ గుప్త పై దాడి అమానుషం* ....తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య జర్నలిస్ట్ యూనియన్

 



*మార్కెట్ చైర్మన్ అరుణ గుప్త పై దాడి  అమానుషం*

....తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య జర్నలిస్ట్ యూనియన్ 


అచ్చంపేట మార్కెట్ చైర్మన్ అరుణ పై రైతులు దాడి చేయడం అమానుషమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ మల్లేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బల్లు సతీష్,ఉపాధ్యక్షులు నరేంద్రుల అమర్ గుప్తా  తీవ్రంగా ఖండించారు. ఆర్య వైశ్యులు మార్కెట్ చైర్మన్ గా ఉండడాన్ని  కొందరు జీర్ణించుకోలేక ఇలాంటి అమానుష చర్యలకు పాలుపడుతున్నారని ఆరోపించారు.  ఒక మహిళ అని కూడా చూడకుండా ఈవిధంగా వ్యవహరించడం సభ్యసమాజం తలదించుకునే విధంగా చేసిన చర్యను కులాలకు అతీతంగా   సమాజంలో అన్ని కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని అయన డిమాండ్ చేశారు. వైశ్యులకు కూడా రాజకీయాల్లో ఉండేందుకు హక్కు ఉందని అన్నారు. తుకాలలో మోసాల జరిగితే గీట్టు గిట్టుబాటు ధర లభించకపోతే చైర్మన్ కు సెక్రటరీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఆమెను కొట్టుకుంటూ తీసుకురావడం అమానుషమైన చర్యని అన్నారు. ఇప్పటివరకు ఎందరో అచ్చంపేట మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ లు చేసిన వారు ఉన్నారనీ కానీ ఏ మార్కెట్ చైర్మన్ పై కూడా దాడి చేయలేదని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేయాలని అన్నారు. దోషులను శిక్షించేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు కూడా ఆర్యవైశ్యుల సిద్ధంగా ఉన్నారని అన్నారు.... అరుణ గుప్త పట్ల జరిగిన ఇలాంటి సంఘటన  రాష్ట్రంలో  మరే మహిళా పై జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్