నల్గొండలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
*నల్గొండలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు*
*తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్* ఆధ్వర్యంలో నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ లోనీ 18 అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ శనివారం 24వ తేదీ న ఉదయం 10 గంటలకు
*సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు* నిర్వహించడం జరుగుతుంది.. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ తప్పకుండా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదంలు స్వీకరించి, స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ పాతబస్తీ హనుమాన్ నగర్ నల్లగొండ వారు
కోరారు. వ్రతానికి సంబంధించిన వ్రతం పిట మరియు వ్రతం దగ్గర కావలసినటువంటి పూజా సామాగ్రి అందరికీ ప్రసాదం మరియు తిరుపతికి సంబంధించిన కంకణాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరుగుతుందనీ పూజలో పాల్గొనే దంపతులు తీసుకురావాల్సిన పూజ సామాగ్రి1)పసుపు 2) కుంకుమ 3) కొబ్బరికాయ, అగరబత్తులు, కొన్ని విడి పూలు..4) మంగళ హారతి తెచ్చుకోవాలని తెలిపారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొనేవారు ముందుగా సమాచారం ఇవాలని, పూర్తి వివరాల కొరకు 8985508263,9553985143 సంప్రదించ వచ్చని తెలిపారు. నల్గొండ పట్టణంలోని హిందూ బంధువులు ఈ యొక్క సామూహిక వ్రత పూజలో అధిక సంఖ్యలో పాల్గొనీ స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరారు.
Comments
Post a Comment