యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పై ప్రజాభిప్రాయ సేకరణ
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పై ప్రజాభిప్రాయ సేకరణ
నల్గొండ : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (YTPS) నిర్మాణంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ హారిచందన దాసరి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న (5x800) మెగావాట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (YTPS) నిర్మాణాన్ని తెలంగాణ జెన్‌కో చేపట్టింది. ఈ నిర్మాణంలో భాగంగా పర్యావరణంపై అధికారులు, ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, 48 మంది తమ అభిప్రాయాలను నేరుగా వెల్లడించగా,ఇదే అంశంపై 22 మంది తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. 35 ధరకాస్తులు ఆన్లైన్, ఈ మెయిల్స్ ద్వారా వచ్చినట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు సందర్బంగా పర్యావరణంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని చెప్పారు.
అనంతరం పర్యావరణ సమస్యలపై ప్రజలు లేవనెత్తిన అంశాలకు కాలుష్య నియంత్రణ మండలి అధికారి తగు వివరణలు ఇచ్చారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పై ప్రజల సందేహాల ను పవర్ ప్లాంట్ అధికారులు నివృత్తి చేస్తూ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పై ఎలాంటి అపోహలకు అవకాశం లేదని,,పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల జరిగే ఉపయోగాలు, ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కలిగించారు.
ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన వారిలో మెజారిటీ ప్రతినిధులు థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మద్దతు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, జూలకంటి రంగారెడ్డి,ప్రిన్సిపల్ సెక్రెటరీ, జెన్కో, ట్రాన్స్కో సీఎండి రిజ్వి, జెన్కో డైరెక్టర్ అజయ్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి సురేష్, ఆర్డిఓ చెన్నయ్య, ఎన్జీవో ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment