నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలి - తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల డిమాండ్.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలి - తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల డిమాండ్..
గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్ర ప్రజల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సమస్యలను, తనదైన శైలిలో పరిష్కారిస్తూ, దళిత , బడుగు ,బలహీన వర్గాల కు బాసటగా నిలిచి నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మల్లు రవి కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బే షరతుగా పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే ప్రకటించాలని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు , ప్రజాస్వామ్య వాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల నాయకులు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా మల్లు స్వర్గీయ మల్లు అనంతరాములు , సోదరునిగా మల్లు ఆశయాలకు అనుగుణంగా, డాక్టర్ బాబా సాహెబ్ చూపిన మార్గంలో ప్రజలతో మమేకమై నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మల్లు రవి ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, నాగర్ కర్నూలు ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లు రవి గారిని పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే బే షరతుగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుచున్నారనీ వారు తెలిపారు.అవకాశవాద రాజకీయాలతో ఎంతో మంది రాజకీయ నాయకులు పలు పార్టీలు మారుచున్నా కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని , కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం పని చేస్తూ, పార్టీ అభివృద్ధికి , పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులు మల్లు రవి గారే అని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారనీ. కేవలం నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని మాత్రమే ఆశించిన మల్లు రవి ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో , సామాజిక సమీకరణలో భాగంగా గతములో తాను జడ్చర్ల శాసన సభ్యనిగా పనిచేసినప్పటికి అది జనరల్ సీటు అయినందున పార్టీ అధిష్టానం అదేశాలను పాటించి జడ్చర్ల శాసనసభ స్థానాన్ని వదులుకున్న గొప్ప త్యాగశీలి మల్లు రవి అని తెలిపారు. అంతేకాకుండా అక్కడ పోటీలో ఉన్న అనిరుధ్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెలిపించిన నాయకులు , మల్లు రవి , అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అవకాశం కల్పించినప్పటికి,సున్నితంగా తిరస్కరించిన విశాల హృదయము కలిగిన నాయకులు మల్లు రవి
గతములో స్వర్గీయ మల్లు అనంతరాములు నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి చేసిన అభివృద్ధి, పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకొని స్థానిక ప్రజలు ఇప్పటికి కొనియాడుచున్నారనీ మల్లు అనంతరాములు స్వర్గీయ ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాలంలో ఆలిండియా కాంగ్రేస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించబడి అత్యంత విశ్వాస పాత్రునిగా పనిచేసినారని, అదే సమయంలో దక్షిణ భారతదేశంలో 12 రాస్ట్రాలకు ఇంచార్జ్ గా నియంచబడి 12 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ మల్లు అనంతరాములు గారికే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి మల్లు అనంత రాములు వారసునిగా మల్లు రవి ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే ప్రకటించాలని , నిరు పేదల పెన్నిధిగా, బడుగు బలహీన వర్గాల నేతగా మల్లు రవి కి సముచిత స్థానం కల్పించాలని యావత్ తెలంగాణా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనీ వారు తెలిపారు
Comments
Post a Comment