విజ్ఞాన భారతీ ఆధ్వర్యంలో చాయసమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్



 విజ్ఞాన భారతీ ఆధ్వర్యంలో చాయసమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్

నల్గొండ ఫిబ్రవరి 27(గూడచారి) నల్లగొండ నగరంలోని స్థానిక పానగల్లో గల ఛాయా సోమేశ్వరాలయం వద్ద మంగళవారం విజ్ఞాన భారతి ఎన్జీవో (NGO) ఆధ్వర్యంలో ఆప్టిక్స్ పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి.ఆర్.డి.ఓ (DRDO) శాస్త్రవేత్తలు G.N.రావు , శ్రీ లక్ష్మీ,G.L.N మూర్తి హాజరై విద్యార్థులకు ఛాయా సోమేశ్వర ఆలయంలో శివలింగంపై ఛాయా ఏ విధంగా పడుతుంది,అలా ఎందుకు జరుగుతుందనే కోణంలో ప్రయోగాత్మకంగా వివరించి విద్యార్థుల చేత అనేక ప్రయోగాలు చేయించడం జరిగింది.అలాగే వారు మాట్లాడుతూ భారతీయ జీవిత విధానం ప్రతిదీ సైన్స్ తో ముడిపడిందని,ప్రతి గుడిలో సైన్స్ ఉందని వారు అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్లగొండ డీఈవో (DEO) బిక్షపతి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని సైన్స్ లో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలయ్యి దేశానికి సేవ చేయాలని ఆలోచనత్మకంగా మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్.పి.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నన్నూరి రాంరెడ్డి, ఎం వి ఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ , న్యూస్ విద్యాసంస్థల చైర్మన్ గంట్ల అనంత రెడ్డి అక్షర విద్యాసంస్థల చైర్మన్ పోలోజు నాగేందర్ , సిల్వర్ మూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు తిరుమలగిరి, కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ బత్తిని నగేష్ , చిట్యాల కృష్ణవేణి విద్యా సంస్థల చైర్మన్ కన్నెబోయిన శ్రీధర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్