అన్ని పథకాల యూనిట్ల గ్రౌండింగ్ ను మార్చి నాటికి పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.


 

అన్ని పథకాల యూనిట్ల గ్రౌండింగ్ ను మార్చి నాటికి పూర్తి        చేయాలి -  అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.

నల్గొండ: ఫిబ్రవరి 20,
         బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న అన్ని పథకాల యూనిట్ల గ్రౌండింగ్ ను మార్చి నాటికి పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.

       మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ లు ప్రతినెల ప్రభుత్వ శాఖల సహకారంతో కనీసం ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.    సామాజిక భద్రత పథకాల అమలలో  ఇంకా  పురోగతి తీసుకురావాలన్నారు.  బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసి అన్ని ప్రభుత్వ పథకాల యూనిట్లు మార్చినాటికి గ్రౌండ్ చేయాలని అన్నారు. ప్రాధాన్యత రంగం కింద విద్యా రుణాలను ఇంకా పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా 2024- 25 సంవత్సరాలకు సంబంధించి 12,835.58 కోట్ల రూపాయలతో రూపొందించిన వనరుల ఆధారిత రుణ  ప్రణాళికను విడుదల చేశారు.
          2023 సంవత్సరం  డిసెంబర్ త్రైమాసికానికి నిర్దేశించిన లక్ష్యాలను  సాధించినట్లు బ్యాంకర్లు తెలిపారు. ఆర్బిఐ ఎజిఎం గౌమతి ,నాబార్డు డిడియం వినయ్ కుమార్, డిఆర్డిఓ నాగిరెడ్డి, ఎల్డిఎం స్వామి, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఆయా శాఖల అధికారులు ,బ్యాంకు కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్