ఉత్తమ జర్నలిస్ట్ గా బింగి స్వామి
ఉత్తమ జర్నలిస్ట్ గా బింగి స్వామి
పినాకిని మీడియా ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
హైదరాబాద్ రవీంద్రభారతిలో
8వ వార్షికోత్సవ వేడుకలకు సిద్దం
ఇతర రంగాల వారికి సైతం అవార్డులు
అత్యంత ప్రతిష్టాత్మకమైన పినాకినిమీడియా ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను రవీంద్రభారతి లో నేడు మంగళవారం ఫిబ్రవరి 6న అందించ నున్నట్లు *పినాకిని మీడియా చైర్మన్ వంశీకృష్ణ శాస్త్రి* మీడియా ప్రకటనలో తెలిపారు.
గజ్వేల్ పట్టణానికి చెందిన బింగి స్వామి జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి ఐ న్యూస్ సాక్షి హెచ్ఎంటీవీ భారత్ జయహో అనేక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా అనేక కథనాల ద్వారా తక్కువ సమయంలోనే గొప్ప పేరుగాంచి పేదల పక్షాన జర్నలిస్టులు పనిచేయాలని అది తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ద్వారానే సాధ్యమని నమ్మి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా సేవలు కొనసాగిస్తు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు సారధ్యంలో అనేక అక్రమాలపై పోరాటం చేస్తూ జర్నలిస్టుగా అక్రమాలను బయటకు తీస్తు జర్నలిస్టు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బింగి స్వామి పినాకిని ఎనిమిదవ వార్షికోత్సవ ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో రాజకీయ సినీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా పినాకిని మీడియా ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రతి సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారిని ఉత్తమంగా ప్రకటిస్తూ వారి సేవకు గుర్తింపునిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు తో పాటు భారత్ జయహో చైర్మన్ పెద్దపురం నరసింహ న్యాయం దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాపూరావు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి సంగారెడ్డి యాదాద్రి భువనగిరి కామారెడ్డి సిద్దిపేట కు చెందిన జర్నలిస్టులు పాల్గొన్న నున్నట్లు తెలిపారు.
[
Comments
Post a Comment