నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి.రాములు నాయక్
నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి.రాములు నాయక్
: జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండ జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా బి.రాములు నాయక్ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు అడిషనల్ ఎస్పీగా సంగారెడ్డి లొ పని చేస్తూ నల్లగొండ అడిషనల్ ఎస్పీ (పరిపాలన అధికారిగా)నేడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాలో వివిధ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్నందున జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పని చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల మరియు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ గారిని జిల్లా పోలీస్ అధికారులు స్వాగతం పలికారు.
Comments
Post a Comment