పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్ సైట్ లో కాలం చెల్లిన సమాచారం - RTI అమలు లో విఫలం


 

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్ సైట్ లో 

https://tspcb.cgg.gov.in/Pages/RTI.aspx

కాలం చెల్లిన సమాచారం - 

RTI అమలు లో విఫలం


RTI Act 2005 ప్రకారం ప్రతి సంవత్సరం సెక్షన్ 4 (1) బి అనెక్సర్స్ నవీనకరించి ప్రకటించాలి. వెబ్సైట్ లో పెట్టాలి. నోటీస్ బోర్డ్ లో అందరికి అందుబాటులో ఉంచాలి. దాని కి విరుద్ధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్ సైట్ RTI డాక్యుమెంట్స్ లో కాలం చెల్లిన సమాచారాన్నే ఉంచారు. 


RTI సెక్షన్ 4 (1) బి ప్రకారంగా ఉంచిన డాక్యుమెంట్స్ లో అ నెక్సర్ 2 లోని స్టాఫ్ వివరాల్లో మెంబర్ సెక్రటరీ గా ఇంకా నీతు కుమారి ప్రసాద్ ఉన్నట్లు తెలుపుతుంది.  ఈ అధికారి

ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయ్యి  కృష్ణ ఆదిత్య వచ్చారు. వారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు మెంబర్ సెక్రటరీగా  జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉన్నారు. ప్రధాన కార్యాలయపు అధికారుల పని విభజన (Work Allocation) వివరాల్లో కూడా ఎప్పుడో పదవి విరమణ పొందిన చీఫ్ ఎనివిరొన్మెంటల్ ఇంజనీర్  గా విశ్వనాధం పేరే ఉంది. సమాచార హక్కు చట్టం 2005 లో సెక్షన్ 4 (1) బి ని  ప్రతి సంవత్సరం నవీనకరించి వెబ్సైట్ లో నోటీస్ బోర్డులో పెట్టాలని నిబంధన ఉన్నా సమాచార అధికారి పట్టించుకోక పోవడం వారికి సమాచార హక్కు చట్టం పై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. బడ్జెట్ కూడా 2020-21 దే ఉంచారు. 

సమాచార హక్కు చట్టం అమలు లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ సమాచారం ఇవ్వకుండా  లేఖలు పంపి టెక్నికల్ గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం నిర్దిష్ట సమయం లో ఇవ్వకుండా ప్రత్యుత్తరాల తో విలువైన కాలాన్నీ వృదా చేస్తున్నారు.ఈ కార్యాలయ ప్రజా సమాచార అధికారి.  


ఈ క్రింది లేఖను చూస్తే వారి పనితనానికి నిదర్శనం కనపడుతుంది.  

2023 జూలై మరియు 2023 డిసెంబర్ లో చేసుకున్న దరఖాస్తు కు ఇప్పుడు ఫైల్స్ పరిశీలించ మని పంపిన లేఖ.

30 రోజుల్లో సమాచారం ఇవ్వకుండా, చట్టాన్ని అమలు చేయకుండా విఫలం చెందిన PIO పై RTI Act Sec. 20 ప్రకారం రాష్ట్ర సమాచార కమీషనర్ కు  చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు దరఖాస్తు దారుడు తెలిపారు.





 సమాచార హక్కు చట్టాన్ని అమలు పరచకుండా విధుల్లో విఫలం అవుతున్న వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు rti  ఆక్టివిస్టులు కోరుతున్నారు.




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్