34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు కి శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు కి శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ, మార్చ్ 11:
34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు శంకుస్థాపన పనులను నల్లగొండ పురపాలక సంఘం చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
34 వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ బండారు ప్రసాద్ మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో చేపడుతున్న పార్కు చుట్టుపక్కల ప్రహరీ గోడ, పార్కు మంజూరు చేయడం జరిగినదని తెలిపారు.
భవిష్యత్తులో కాలనీలో గల సమస్యలను తీర్చుతామని, కాలనీలో గల పిల్లలకు మహిళలకు వృద్ధులకు అందరికీ పార్కు అందుబాటులోకి రానుందని తెలిపినారు.
న్యూ శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్కు పక్కన జరుగుతున్న వరద కాలువ పనులను పరిశీలించారు.
కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, కాలనీ అధ్యక్షులు నూకల జైపాల్ రెడ్డి కాలనీ సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి వెళ్ళగా పార్కు పక్కన వరద కాలువ వెళ్తున్నందున పిల్లలు ,మహిళలు, వృద్ధులు, పశువులు, పాదచారులు, కాలువలో పడే ప్రమాదం ఉన్నందున మరియు సందులో పైప్ లైన్ వేయించాలని చెప్పడంతో దానికి చైర్మన్ పైప్లైన్ వేయిస్తామని కాల్వపైన కప్పు కూడా వేయిస్తామని తెలిపారు. కాలనీ నిమరొకసారి సందర్శిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కత్తుల షణ్ముఖ, బత్తిని వెంకటేశ్వర్లు ,గార్లపాటి వెంకటయ్య, శంకర్ గౌడ్, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, బి వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి, కేశవ్, అశ్విన్, వెంకన్న, రామ్ రెడ్డి, లింగారెడ్డి, చక్రవర్తి, అనిల్ రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment