క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి - రేఖల భద్రాద్రి-
*క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి*
*కాంగ్రెస్ నాయకులు,జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రి*
*************************************************
*నల్లగొండ*: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రైస్తవులకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఏఐసిఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రేకల భద్రాద్రి కోరారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ సమీపంలో గల చర్చిలో పాస్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో క్రైస్తవులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో కూడా 16 వేల మంది క్రైస్తవులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అండగా ఉండి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్లకు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ , రెండు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రిస్టియన్లకు ఒక రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా క్రిస్టియన్లకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా క్రిస్టియన్లంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు కలిసినందున ఆయన చొరవ తీసుకోవాలని కోరారు.
క్రిస్టియన్లకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం వలన క్రిస్టియన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని కోరుతూ చర్చిలో పాస్టర్లంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్లు, దైవ సేవకులు కట్ట మోసయ్య, జాన్ బాబు, మధుసూదన్, శేషయ్య, కె.యో వెల్, సామెల్, రమేష్, మిషక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment