కౌటికె ఆదిత్య కు ఘనంగా సన్మానం


 కౌటికె ఆదిత్య కు ఘనంగా సన్మానం


భారతీయ జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ సికంద్రాబాద్ డివిజన్ లో గత క్యాలెండరు ఇయర్ లో అత్యధిక ప్రీమియం సంస్థ లో మదుపు చేసి అందరికంటే ముందు ఉన్న సందర్భమున ఈ రోజు హోటల్ మ్యారెట్ లో ఏజెంట్ల కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో కౌటికె ఆదిత్య కు సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎల్ కె శామ్ సుందర్ ఘనంగా సన్మానం చేసారు. దాదాపు 300 మంది డివిజన్ లోని ప్రముఖ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ముఖ్య అతిథి గ విచ్చేసిన జోనల్ మేనేజర్ గ ఆదిత్య చేస్తున్న జీవిత బీమా ప్రొఫెషనల్ విధానాన్ని ప్రశంసించారు . ఈ సందర్భముగా విడుదల చేసిన టాప్ ఏజెంట్ల వివరాలతో విడుదల చేసిన పుస్తకం లో సీనియర్ డివిజనల్ మేనేజర్ రామయ్య కౌటికె ఆదిత్య కౌటికె కావ్య గార్లు డివిజన్ లో వున్న అందరు MDRT ఏజెంట్ల కంటే ప్రతి సంవత్సరం లాగే ఎక్కువ చేసి అందరికంటే ముందు వున్న సందర్భముగా శుభాకాంక్షలు తెలియచేసారు. అంతే కాకుండా వారు చేస్తున్న ప్రొఫెషన్ లో అందరి కంటే ఎక్కువ చేసి No 1 ఉండడం పట్ల ఆభినందించారు. ముఖ్య అతిథి గారి మోటివేషనల్ ప్రసంగం అందరికి నచ్చింది. ఈ సమావేశములో మార్కెటింగ్ మేనేజర్ శ్రీమతి కె సంధ్య రాణి, మేనేజర్ సేల్స్ ప్రసాద్ గారు మరొక మేనేజర్ సేల్స్ శ్రీమతి ఉషశ్రీ గారు డివిజినల్ మేనేజర్ నాగరాజు గార్లు పాల్గొన్నారు*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్