పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు
పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన
పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు
నల్లగొండ:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం (ఐ ఈ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పర్యావరణ అంశాలతో కూడిన ప్రకృతి దినాలను పొందుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పర్యావరణ కార్యకర్త జీడిమెట్ల రవీందర్ ,సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎండి సజీనా బేగం, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పురుషోత్తం రెడ్డి, డాక్టర్ యం.రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రహిమ, కె.నాగరాజు, విజిత, తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment