పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - గుమ్మల


 07/03/2024




*పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*


*నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి*

******************************************"*******

*నల్లగొండ*: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పని చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని నల్గొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ రెండు కళ్ళని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి అభ్యర్థులు గెలుపు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరే విధంగా తమవంతుగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే యువజన కాంగ్రెస్ నాయకులకు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.యూత్ కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదగడానికి యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టని అన్నారు.


నల్గొండ మున్సిపల్ చైర్

బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ

 రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ మరింత బలపడేలా చూడాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఒక సైనికులు లాగా పనిచెయ్యలని పిలుపునిచ్చారు.


గత ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నల్గొండ మండల అధ్యక్షుడు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల అధ్యక్షుడు కూసుకుంట్ల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్