చిన్న పత్రికలకు చేయూత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

 



చిన్న పత్రికలకు చేయూత 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి


హైదరాబాద్ :


చిన్న పత్రికలతో పాటుజర్నలిస్టుల సమస్యలపై 

పూర్తి అవగాహన 

ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన పిదప తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు. అనంతరం చిన్న పత్రికల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, ప్రధాన కార్యదర్శి అహమ్మద్ అలీలతో కూడిన బృందం వినతి పత్రాన్ని సమర్పించారు. చిన్న పత్రికలకు చేయుత నందించాలని కోరారు.జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ, గత కొంతకాలంగా చిన్న, మధ్య తరహా పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఆఫ్ గ్రేడ్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దిన పత్రికలతో పాటు మ్యాగజైన్ లకు కూడా ప్రకటనలు జారీ చేసేలా తగు సూచనలు ఇవ్వాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ అక్రిడిటేషన్ కార్డులు కల్గిన చిన్న మధ్య తరహా పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులకు హైదరాబాద్ లోనే ఇళ్ళ స్థలాలు, ఇళ్ళను కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమవరపు యాదయ్య , కోటగిరి చంద్ర శేఖర్, చిట్యాల శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి కొమ్మరాజు శ్రీనివాసులు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండి మక్సుద్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, సంధ్యాల విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అఫ్జల్ ఖాన్, జిల్లా కమిటీ సభ్యులు వీరెల్లి వెంకటరమణ, శ్రీరంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 *కార్యవర్గంలో మార్పులు* 

తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్రఉపాధ్యక్షులుగా కోటగిరి చంద్ర శేఖర్, రాష్ట్ర కోశాధికారి కొమ్మరాజు శ్రీనివాసులు, నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఎండి మక్సుద్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల వెంకటయ్యలనునియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాతంగి ప్రకటించారు. మిగిలిన కార్యవర్గం అంతా యధావిధిగా ఉంటుందన్నారు. సంఘ పటిష్ఠతకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్